Home

»

Latest News

మెగా అప్‌డేట్‌: చిరంజీవి ‘కాకా’లో అనురాగ్ కశ్యప్.. రోల్ ఏంటో తెలిస్తే షాక్.!

Oct 5, 2026 6:43PM

మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం బాబీ కొల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘కాకా’పై భారీ అంచనాలు ఉన్నాయి. ‘వాల్తేరు వీరయ్య’ తర్వాత చిరంజీవి-బాబీ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో మొదటి నుంచే ఈ ప్రాజెక్ట్‌పై మంచి బజ్ ఉంది.

ఇప్పుడు ఈ సినిమాలోకి మరో ఆసక్తికరమైన పేరు వచ్చి చేరింది. ప్రముఖ దర్శకుడు, నటుడు అనురాగ్ కశ్యప్ ‘కాకా’లో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఆయన సినిమాలో భాగమైన విషయాన్ని మేకర్స్ అధికారికంగా వెల్లడించారు.

తాజాగా దర్శకుడు బాబీ.. అనురాగ్ కశ్యప్‌కు ఓ సన్నివేశాన్ని వివరిస్తున్న ఫొటోను మేకర్స్ షేర్ చేశారు. దీంతో ‘కాకా’లో అనురాగ్ కశ్యప్ పాత్ర ఎలా ఉండబోతుందనే ఆసక్తి మొదలైంది.

ప్రస్తుతం ‘కాకా’ షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. ముఖ్యంగా సినిమా సెకండ్ హాఫ్‌కు సంబంధించిన కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ షెడ్యూల్‌లో అనురాగ్ కశ్యప్‌తో పాటు మరికొందరు ప్రముఖ నటీనటులు కూడా పాల్గొంటున్నారు.

ఇప్పటికే సినిమా ఫస్ట్ హాఫ్ షూటింగ్ పూర్తయింది. మరోవైపు సంగీత దర్శకుడు ఎస్. థమన్ సినిమా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌పై వర్క్ చేస్తున్నారు. షూటింగ్‌ను అనుకున్న ప్లాన్ ప్రకారమే పూర్తి చేసే దిశగా టీమ్ ముందుకు వెళ్తున్నట్లు సమాచారం.

‘కాకా’లో చిరంజీవి లుక్ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. యంగ్ అండ్ స్టైలిష్ లుక్‌లో మెగాస్టార్ కనిపించబోతుండగా.. సినిమా హై-ఆక్టేన్ యాక్షన్‌తో ఉండబోతున్నట్లు ఇప్పటికే బజ్ ఏర్పడింది. అనస్వర రాజన్ ఇందులో అమ్ములు పాప అనే కీలక పాత్రలో నటిస్తున్నారు.

ఇక అనురాగ్ కశ్యప్ ఎంట్రీతో సినిమాపై ఆసక్తి మరింత పెరిగింది. దర్శకుడిగా తనదైన ముద్ర వేసిన అనురాగ్.. నటుడిగా కూడా ఇటీవలి కాలంలో పలు సినిమాల్లో ప్రత్యేకమైన పాత్రలు చేస్తున్నారు. ‘కాకా’లో ఆయన పాత్రను బాబీ చాలా డిఫరెంట్ గా డిజైన్ చేశారని తెలుస్తోంది.

కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ సినిమాను సంక్రాంతి కానుకగా 2027, జనవరి 13న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు.

ఇది కూడా చదవండి: అల్లు అర్జున్ ప్లాన్ ఏంటి.. లోకేష్ ప్రాజెక్ట్ ఎప్పుడు మొదలవుతుంది.?

 

 

 

[Anurag Kashyap Joins Kaaka, Kaaka Movie, Kaaka Release Date, Megastar Chiranjeevi, Bobby Kolli, Anurag Kashyap, Anaswara Rajan, Telugu Film News]

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com