Home

»

Latest News

ANR: ఏఎన్నార్ టైటిల్స్‌ వాడితే పరిస్థితి ఇదే.. కానీ ఆ ఒక్క హీరో మాత్రం 

Mar 02, 2026

 

 

-ఏఎన్నార్ కి మరణం లేదని ఫ్యాన్స్ అభిప్రాయం 
-అందుకు సాక్థ్యం ఆయన చిత్రాలే 
-సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ఏంటి!


నటసామ్రాట్, ఎవర్ గ్రీన్ అక్కినేని నాగేశ్వరరావు(ANR)సృష్టించిన సినీ చరిత్రకి మరణం అసాధ్యం. ఎందుకు అసాధ్యమో అభిమానులకి, తెలుగు సినిమా ప్రేమికులకి బాగా తెలుసు. ఇంకెవరికి తెలియాల్సిన అవసరం లేదు. ఏఎన్నార్ మన మధ్య లేరనే మాట కూడా అబద్ధమని ఫ్యాన్స్, మూవీ లవర్స్ అంటుంటారు. జ్ఞానం, విచక్షణ, సంస్కారం, నిజాయితీ, స్వచ్ఛమైన ప్రేమ. ఆ ఐదు పంచామృతాలని పంచే చిత్రాలు తమ దగ్గర ఉండగా  ఏఎన్ఆర్ కి మరణం లేదని ఆ అందరి నమ్మకం.  రీసెంట్ గా ఏఎన్ఆర్ సినిమాలకి, కొంత మంది బడా హీరోల సినిమాలకి సంబంధించిన ఆసక్తికర న్యూస్ సోషల్ మీడియాలో సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా నిలిచింది. మరి ఆ న్యూస్ ఏంటో చూద్దాం.

దేవదాసు, యువరాజు, అందాల రాముడు. ఏఎన్ఆర్  నుంచి వచ్చిన ఆ మూడు చిత్రాలు అభిమానులకి ఫేవరేట్ చిత్రాలు.తర్వాత కాలంలో దేవదాస్ అనే టైటిల్ తో  కృష్ణ(Krishna),నాగార్జున(Nagarjuna)తమ చిత్రాలని తెరకెక్కించి పరాజయాన్ని అందుకున్నారు. మహేష్ బాబు(Mahesh Babu)తన సెకండ్ మూవీగా 'యువరాజు' తో ప్లాప్ ని ఒడిసి పట్టుకున్నాడు. కామెడీ కింగ్  సునీల్(Sunil)మాత్రం 'అందాల రాముడు' టైటిల్ తో ఒక చిత్రాన్ని  తెరకెక్కించి హిట్ ని అందుకున్నాడు.

also read: Manjummel boys: మంజుమ్మల్ బాయ్స్ దర్శకుడిపై లైంగిక వేధింపుల కేసు.. పేరు తెలిస్తే షాక్ గ్యారంటీ  

ఇప్పుడు ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తెలుగు సినిమా పుట్టిన దగ్గరనుంచి పాత సినిమా టైటిల్ తో అనేక సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఈ నేపథ్యంలో అక్కినేని సినిమా టైటిల్ మ్యాటర్  వైరల్ గా మారింది.  

 

 


 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com