Home

»

Latest News

‘రణబాలి’ కోసం రంగంలోకి అన్నామలై: సినిమా విడుదలకు ముందు సంచలనం తప్పదా.?

Oct 13, 2026 3:00PM

సినిమా ప్రమోషన్స్ అంటే సాధారణంగా హీరోలు, దర్శకులు, చిత్ర బృందం ఇంటర్వ్యూలు ఇవ్వడం చూస్తుంటాం. కానీ, ఇప్పుడు విజయ్ దేవరకొండ తన ‘రణబాలి’ సినిమా కోసం ఓ స్పెషల్ ప్లాన్‌తో ముందుకొచ్చారు. తమిళనాడు రాజకీయాల్లో గుర్తింపు తెచ్చుకున్న అన్నామలైతో పాటు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సాయి దీపక్‌తో ప్రత్యేక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. దీంతో ఈ ఇంటర్వ్యూ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న ‘రణబాలి’ అక్టోబర్ 16న ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో చిత్ర బృందం ప్రమోషన్స్‌ను వేగవంతం చేసింది. ఈ క్రమంలోనే అన్నామలై, సాయి దీపక్‌లతో నిర్వహించిన ప్రత్యేక చర్చను తెరపైకి తీసుకొచ్చింది.

ఈ ప్రత్యేక ఇంటర్వ్యూలో విజయ్ దేవరకొండతో పాటు దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ కూడా పాల్గొన్నారు. కేవలం సినిమా విశేషాలకే పరిమితం కాకుండా భారతీయ చరిత్ర, బ్రిటిష్ వలస పాలన వంటి అంశాలపై కూడా చర్చించినట్లు చిత్ర నిర్మాణ సంస్థ వెల్లడించింది.

నిజానికి ‘రణబాలి’ కథకు చారిత్రక నేపథ్యం కీలకం. బ్రిటిష్ పాలన సమయంలో రాయలసీమ ప్రాంతంలో చోటుచేసుకున్న పరిస్థితులు, అప్పటి ప్రజలు ఎదుర్కొన్న కష్టాలను ఆధారంగా చేసుకుని ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. 1854 నుంచి 1878 మధ్య బ్రిటిష్ ఇండియాలో జరిగిన వాస్తవ సంఘటనల ప్రేరణతో కథను తెరకెక్కించినట్లు మేకర్స్ చెబుతున్నారు. దీంతో ఈ ఇంటర్వ్యూలో చరిత్రకు సంబంధించిన ఎలాంటి విషయాలు చర్చకు వచ్చాయనే ఆసక్తి నెలకొంది.

మైత్రీ మూవీ మేకర్స్ ఈ ప్రత్యేక ఇంటర్వ్యూకు సంబంధించిన అప్డేట్ ను సోషల్ మీడియాలో పంచుకుంది. అక్టోబర్ 14న ఈ ఇంటర్వ్యూను విడుదల చేయనున్నట్లు తెలిపింది. సినిమా విడుదలకు కేవలం రెండు రోజుల ముందు ఈ ఇంటర్వ్యూ ప్రేక్షకుల ముందుకు రానుండటంతో ప్రమోషన్స్‌లో ఇదొక ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.

ఇది కూడా చదవండి: కరికాల మూవీ.. సాక్షి మడోల్కర్ లుక్ అదిరింది.!

 

 

 

[Annamalai For Ranabaali, Ranabaali Interview, Vijay Deverakonda Interview, Ranabaali Promotions, Annamalai, Sai Deepak, Vijay Deverakonda, Rashmika Mandanna, Rahul Sankrityan]

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com