Home

»

Latest News

Anil ravipudi: కళ్యాణ్ గారితో చెయ్యాలనే కోరిక నెరవేరింది.. అనిల్ రావిపూడి స్పీచ్ వైరల్

Feb 28, 2026

 

-అనిల్ రావిపూడి మాటలతో ఫ్యాన్స్ లో జోష్ 
-నెక్స్ట్ సినిమా అప్ డేట్ ఏంటి
-నెక్స్ట్ పొంగల్ కి కూడా హిట్ ఖాయమా!  


తెలుగు చిత్రసీమలో తనకంటు ప్రత్యేకమైన శైలిని సంపాదించుకున్న దర్శకుడు అనిల్ రావిపూడి(Anil Ravipudi). హిట్ సినిమా సూత్రం ఏంటో తెలియక హిట్ ప్రసవ వేదనని అనుభవిస్తున్న సినీ మేకర్స్ తమ ముక్కున వేలు వేసుకొనే విధంగా వరుస హిట్ లతో దూసుకుపోతున్నాడు. అది కూడా అనాదిగా వస్తున్న అచ్చ తెలుగు సినిమా ఫార్మెట్ తో. పైగా ఎంటర్ టైన్ మెంట్.  దీంతో నీతో పాటే నేను అంటూ విజయం అనిల్ రావిపూడితో కలిసి నడవడానికి డిసైడ్ అయ్యింది. ప్రస్తుతం ఆయన తన తదుపరి చిత్రం కోసం సన్నద్ధమవుతున్నాడు. ఈ సారి కూడా సంక్రాంతికే ఫిక్స్ అయ్యాడు. వెంకటేష్ (Venkatesh), కళ్యాణ్ రామ్ (kalyan Ram) హీరోలు. రీసెంట్ గా ఆయన మాడ్ ఫర్ ఈచ్ అదర్(Mad For Each Other)ప్రోగ్రాంకి జడ్జిగా వ్యవహరించబోతున్నాడు. ఈ సందర్భంగా తన అప్ కమింగ్ సినిమా విషయాలని తెలుగు వన్ ప్రేక్షకులతో పంచుకున్నాడు. ఆ విశేషాలేంటో చూద్దాం 

ఆయన మాట్లాడుతు వెంకటేష్, కళ్యాణ్ గార్లతో తెరకెక్కే సినిమా చాలా ఎంటర్ టైన్మెంట్గా ఉండబోతుంది.గత రెండు సంక్రాంతులని ఆడియెన్స్ ఎంత ఎంజాయ్ చేసారో నెక్స్ట్ పొంగల్ కూడా అంతే ఎంజాయ్ చేస్తారు. నాకు ఎప్పట్నించో కళ్యాణ్ గారితో చెయ్యాలని ఉంది. రైట్ సెటప్, రైట్ ప్రాజెక్ట్ కోసం ఎదురుచూస్తున్నాను. ఇప్పుడు కుదిరింది. సంక్రాంతి అందరికి విజయాలు అందించాలని కోరుకుంటున్నానని చెప్పాడు. కళ్యాణ్ రామ్ హిట్ మూవీస్ లో ఒకటైన పటాస్ తోనే అనిల్ రావిపూడి దర్శకుడిగా పరిచయమైన విషయం తెలిసిందే.  

also read: Vishnu Vinyasam: విష్ణు విన్యాసం ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. నిజమేనా! 


మాడ్ ఫర్ ఈచ్ అదర్  షో గురించి కూడా మాట్లాడుతు  నా మాడ్ నెస్ కంటే లోపల ఉన్న కపుల్ మాడ్ నెస్ ముఖ్యం. కపుల్స్ వాళ్ల ఛాలెంజ్ స్ తో ఏ విధంగా ముందుకు వస్తున్నారు. వాళ్ల మధ్య బాండింగ్ ఏంటి? స్టేబుల్ గా ఎలా ఉండగలుగుతున్నారు అనేది తెలియబోతుంది. టోటల్ గా డిఫరెంట్ కాన్సెప్ట్. ఎమోషనల్ గా కాకుండా రియల్ స్టిక్ గా ఉంటుంది. నాచురల్ షో. నాకు న్యూ ఎక్స్ పీరియెన్స్ అని అనిల్ రావిపూడి చెప్పుకొచ్చాడు. సదరు షో జియో హాట్ స్టార్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది.మరిన్ని సినిమా అప్‌డేట్స్, ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూలు,అనిల్ రావిపూడి తదుపరి చిత్రం గురించిన మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం ఇప్పుడే మా యూట్యూబ్ ఛానల్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి.  కింద ఉన్న వీడియో కూడా చూడండి

 


g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com