Home

»

Latest News

అమీర్ లోగ్: ఓటీటీలో అదరగొడుతోన్న హైదరాబాద్ బస్తీ కథ.!

Oct 4, 2026 11:04AM

అవ్వల్ నంబర్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద మాధవి సోమ నిర్మాణంలో రమణా రెడ్డి తెరకెక్కించిన చిత్రం ‘అమీర్ లోగ్’. ఈ మూవీలో ఎంసి హరి, మనోజ్, శశిధర్, వేద జలంధర్, విశ్వేందర్ రెడ్డి, సాయి యోగి ప్రధాన పాత్రల్ని పోషించారు. ఈ చిత్రం ఆగస్ట్‌లో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. 

హైదరాబాద్ బస్తీలోని స్నేహాన్ని, ప్రేమను, బంధాల్ని చాటి చెప్పే చిత్రంగా అందరి హృదయాల్ని గెల్చుకుంది. ఈ సినిమాలోని పాటలు హైదరాబాద్ కల్చర్‌కి ఆంథమ్‌లా మారిపోయాయి. కుర్రాళ్లకు స్పూర్తినిచ్చేలా, మంచి సందేశంతో తీసిన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకుల్ని మెప్పించింది.

ఎంసి హరి, మనోజ్, శశిధర్, వేద జలంధర్, విశ్వేందర్ రెడ్డి పాత్రలకు ప్రేక్షకులకు మంచి స్పందన వచ్చింది. ఇక ఈ మూవీని రానా స్పిరిట్ మీడియా గ్రాండ్‌గా రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మంచి రిలీజ్ దొరకడం, ఆడియెన్స్‌ నుంచి ప్రశంసలు దక్కడంతో చిత్ర యూనిట్ సంతోషాన్ని వ్యక్తం చేసింది. ఇక ఇప్పుడు ఈ చిత్రాన్ని ప్రముఖ ఓటీటీ సంస్థ స్ట్రీమింగ్‌ చేస్తోంది.

ప్రస్తుతం ‘అమీర్ లోగ్’ మూవీని అమెజాన్ ప్రైమ్ స్ట్రీమింగ్ చేస్తోంది. ఆల్రెడీ ఓటీటీలోనూ ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ మూవీకి స్మరణ్ సాయి ఇచ్చిన సంగీతం, ఎస్వీకే సినిమాటోగ్రఫీ ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.

ఇది కూడా చదవండి: లెజెండరీ డైరెక్టర్ సింగీతం టాప్-10 మూవీస్ 

 

 

 

[Ameer Log OTT Response, Ameer Log OTT Release, Ameer Log Movie, Rana Daggubati, Telugu Movies 2026, Latest Telugu Movies, Telugu Film News]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com