Home

»

Latest News

అశ్లీల సన్నివేశాలు: అమలాపాల్ షాకింగ్ కామెంట్స్.. ఎవరి కోసం!

Oct 1, 2026 5:05PM


మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో నాయక్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో ఇద్దరమ్మాయిలతో' వంటి చిత్రాల్లో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్న భామ అమలాపాల్.దీంతో ఆమె పేరు చెప్పగానే మెమొరీబుల్ సినీ మూమెంట్స్ గుర్తుకొస్తాయి.

 ఇక తను  2019వ సంవత్సరంలో వచ్చిన ‘ఆడై’ (తెలుగులో ‘ఆమె’) చిత్రం ద్వారా ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఒక పెద్ద సంచలనమే సృష్టించారు. రత్నకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో అమలాపాల్ కామిని అనే టీవీ జర్నలిస్ట్ పాత్రలో కనిపించి, ఎవరూ చేయని విభిన్నమైన సాహసాన్ని చేశారు. అయితే, తాజాగా ఈ సినిమాలో తాను చేసిన రిస్కీ నగ్న ఘట్టాల చిత్రీకరణ గురించి, ఆ సమయంలో పడ్డ భయాల గురించి అమలాపాల్ పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.   ముఖ్యంగా ఈ చిత్రంలోని ఒక అత్యంత కీలకమైన అశ్లీల సన్నివేశాన్ని దర్శకుడు రత్నకుమార్ ఏ విధంగా తీస్తారో అనే తీవ్రమైన ఆందోళన తనను వెంటాడిందని ఆమె తెలిపారు. 


కథలోని ఆత్మను పక్కన పెట్టి, కేవలం ఆ బోల్డ్ మరియు న్యూడ్ అంశంపైనే శ్రద్ధ పెడతారేమో అని తను తీవ్రంగా భయపడినట్లు వివరించారు. ఆ సినిమా మేకర్ల ఆలోచనా విధానాన్ని, విజన్‌ను పూర్తిగా అర్థం చేసుకోవడానికి తనకు దాదాపు 2 నెలల సుదీర్ఘ సమయం పట్టిందని అమలాపాల్ గుర్తుచేసుకున్నారు. ఈ ప్రాజెక్ట్‌పై నిర్ణయం తీసుకునే ముందు చిత్ర బృందంతో కలిసి ప్రయాణం చేస్తూ వారి నిజాయితీని పరిశీలించిన తర్వాతే తను ముందడుగు వేశారు.   ఒక వైపు తన వ్యక్తిగత ఇమేజ్ దెబ్బతింటుందేమోనన్న భయం, మరోవైపు భవిష్యత్తు కెరీర్‌లో కూడా తనను ఇలాంటి టైప్ కాస్ట్ లేదా స్టీరియోటైప్ పాత్రలకే పరిమితం చేస్తారేమోనన్న ఆందోళన ఆమెను తీవ్రంగా కలిచివేశాయి. అయినప్పటికీ, దర్శకుడి పనితనం పై ఉన్న నమ్మకంతో ఒక పెద్ద రిస్క్ తీసుకుని  గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.


ఇది కూడా చదవండి: ది ప్యారడైజ్ కి సంబంధించి రెమ్యునరేషన్ ఎంత ఇచ్చారో తెలుసా: పాపం భయ్యా!

 

 

 చిత్రీకరణ సమయంలో తనను ఎంతో సౌకర్యవంతంగా ఉంచడానికి సెట్‌లో కేవలం అతితక్కువ మంది క్రూ సభ్యులను మాత్రమే అనుమతించారని, సుమారు 20 రోజులకు పైగా సాగిన ఈ తరహా బోల్డ్ షూటింగ్‌లో తనకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా మేకర్స్ జాగ్రత్త పడ్డారని చెప్పారు.   అప్పట్లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుని, సెన్సార్ బోర్డు నుండి ఏ సర్టిఫికెట్ పొందింది. అయితే తన జీవితంలో వయస్సు, అనుభవంతో పాటు ప్రాధాన్యతలు మారాయని చెబుతూ, 'ఒకవేళ ఇప్పుడు గనుక నన్ను ఆడై వంటి పాత్ర చేయమని అడిగితే, కచ్చితంగా నేను అలాంటి నిర్ణయం తీసుకోను మరియు నటించను' అని అమలాపాల్ స్పష్టం చేశారు. 

 

 

[Amala Paul About Aadai Movie Bold Scenes,Amala Paul, Aadai Movie, Amala Paul Nude Scene, Aame Movie Telugu, Amala Paul Interview, Telugu Cinema News, Telugu Cinema, Tollywood Cinema News, Tollywood]
 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com