Home

»

Latest News

అల్లు అర్జున్ వదిలేస్తే బ్లాక్‌బస్టరే.. ఎన్టీఆర్‌కు మళ్ళీ లక్కీ ఛాన్స్.!

Jul 4, 2026 3:14PM

సినిమా పరిశ్రమలో ఒకరి వద్దనుకున్న కథ మరొకరి లక్కీ ఛాన్స్‌గా మారడం చాలా సహజం. అయితే టాలీవుడ్‌లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) వదిలేసుకున్న సినిమాలు వేరే హీరోల వద్దకు వెళ్తే అవి కచ్చితంగా బ్లాక్‌బస్టర్లుగా మారుతుండటం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. దర్శకుడు కథ చెప్పినప్పుడు నచ్చకపోవడమో, లేక ప్రాజెక్ట్ అనౌన్స్ చేసిన తర్వాత ఆ దర్శకుడి మునుపటి సినిమా రిజల్ట్‌ను బట్టి హ్యాండ్ ఇవ్వడమో బన్నీ స్టైల్ అనే టాక్ ఇండస్ట్రీలో ఉంది. 

ఈ క్రమంలోనే తాజాగా అనౌన్స్ చేసిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (NTR), త్రివిక్రమ్ శ్రీనివాస్ క్రేజీ కాంబినేషన్ మూవీ 'గాడ్ ఆఫ్ వార్' (God of War) వెనుక కూడా ఇలాంటి ఆసక్తికరమైన కథ ఒకటి నడుస్తోంది. ఈ ప్రాజెక్ట్ మొదట అల్లు అర్జున్ ఖాతాలోనే ఉంది. కానీ సమీకరణాలు మారి తారక్ చేతికి చేరడంతో, బన్నీ సెంటిమెంట్ ప్రకారం ఈ సినిమా కూడా ఇండస్ట్రీ షేక్ చేయడం ఖాయమని నందమూరి అభిమానులు ఇప్పటి నుంచే కాలర్ ఎగరేస్తున్నారు.

గతంలోకి వెళ్తే అల్లు అర్జున్ రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్ చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. 'అర్జున్ రెడ్డి', 'గీత గోవిందం', 'బొమ్మరిల్లు', '100% లవ్', 'టెంపర్' వంటి సూపర్ హిట్ చిత్రాల కథలు మొదట అల్లు అర్జున్ దగ్గరికే వెళ్లాయి. అప్పట్లో బిజీ షెడ్యూల్స్ కారణంగా బన్నీ ఈ ప్రాజెక్టులను వదులుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత ఆ సినిమాలు వేరే హీరోలతో తెరకెక్కి ఎలాంటి సంచలనాలు సృష్టించాయో మనమంతా చూశాం. ఈ సెంటిమెంట్ కేవలం కథల దశలోనే కాదు, ఏకంగా అధికారికంగా అనౌన్స్ చేసిన పెద్ద ప్రాజెక్టుల విషయంలోనూ రిపీట్ కావడం విశేషం.

కొరటాల శివ దర్శకత్వంలో 'AA 21' అంటూ ఒక భారీ చిత్రాన్ని ప్రకటించాడు. ఏవో కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ ను పక్కన పెట్టేశాడు. తర్వాత ఆ కథ కాస్తా ఎన్టీఆర్ దగ్గరికి వెళ్లింది. అలా కొరటాల శివ, ఎన్టీఆర్ కాంబినేషన్‌లో వచ్చిన 'దేవర' చిత్రం బాక్సాఫీస్ వద్ద వందల కోట్ల వసూళ్లతో సెన్సేషనల్ హిట్ కొట్టింది.

ఇప్పుడు ఇదే సీన్ డైరెక్టర్ త్రివిక్రమ్ విషయంలోనూ రిపీట్ అయింది. అల్లు అర్జున్‌కు 'జులాయి', 'సన్ ఆఫ్ సత్యమూర్తి', 'అల వైకుంఠపురములో' వంటి హ్యాట్రిక్ బ్లాక్‌బస్టర్ హిట్స్ గురూజీతో ఐకాన్ స్టార్ తన నాల్గవ సినిమాను అనౌన్స్ చేశాడు. అఫీషియల్ పోస్టర్ కూడా రిలీజ్ అయింది. కానీ త్రివిక్రమ్ మునుపటి చిత్రం 'గుంటూరు కారం' ఆశించిన విజయం సాధించకపోవడం, మరోవైపు 'పుష్ప' సిరీస్‌తో అల్లు అర్జున్ రేంజ్ పాన్ ఇండియా స్థాయికి వెళ్లడంతో, త్రివిక్రమ్‌కు పాన్ ఇండియా మార్కెట్ హ్యాండ్లింగ్ అనుభవం లేదనే నెపంతో బన్నీ ఈ ప్రాజెక్ట్‌ను హోల్డ్‌లో పెట్టాడనే ప్రచారం సాగింది. చివరకు ఆ పాన్ ఇండియా డ్రీమ్ ప్రాజెక్ట్ 'గాడ్ ఆఫ్ వార్' ఇప్పుడు ఎన్టీఆర్ గూటికి చేరింది. బన్నీ వదిలేసిన గత ఐదారు సినిమాలు, అలాగే కొరటాల 'దేవర' హిస్టరీని చూస్తుంటే, త్రివిక్రమ్-తారక్ కాంబోలో రాబోతున్న ఈ 'గాడ్ ఆఫ్ వార్' కూడా బాక్సాఫీస్‌ను ఊచకోత కోయడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరి ఈ అంచనాలు ఎంతవరకు నిజమవుతాయో తెలియాలంటే మరికొన్నాళ్లు ఆగాల్సిందే.

 

 

Allu Arjun, Jr NTR, Koratala Siva, Trivikram Srinivas, God Of War

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com