Home

»

Latest News

‘రామాయణ’పై అల్లు అర్జున్ ట్వీట్: ఇది సినిమా మాత్రమే కాదు.!

Nov 4, 2026 2:18PM

రణబీర్ కపూర్, సాయి పల్లవి, యశ్ ప్రధాన పాత్రల్లో నితేశ్ తివారీ తెరకెక్కిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘రామాయణ’పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. భారతీయ ఇతిహాసమైన రామాయణాన్ని వెండితెరపై ఆవిష్కరించే ప్రయత్నం కావడంతో ఈ సినిమాపై సినీ ప్రేక్షకుల్లోనే కాకుండా ఇండస్ట్రీలోనూ ఆసక్తి నెలకొంది. తాజాగా ఈ ప్రాజెక్ట్‌కు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన మద్దతు ప్రకటించారు.

‘రామాయణ’ చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ అల్లు అర్జున్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. ఇది కేవలం సినిమా మాత్రమే కాదని.. మన సంస్కృతికి ప్రతిరూపమని ఆయన పేర్కొన్నారు. భారతీయ సినిమాల స్థాయిని మరో మెట్టు పైకి తీసుకెళ్లే ప్రయత్నంగా అభివర్ణించారు. మన కథలు, మన సంస్కృతి, మన ఘనతను ప్రపంచానికి చాటే ఇలాంటి ప్రయత్నానికి ప్రతి ఒక్కరూ మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు.

ఈ దైవిక ప్రయత్నం విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని అల్లు అర్జున్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. అందరం ఒక్కటై ఇలాంటి ప్రయత్నానికి అండగా నిలవాలని చెబుతూ చివర్లో ‘జై శ్రీరామ్’ అంటూ తన సందేశాన్ని ముగించారు.

అల్లు అర్జున్ చేసిన ఈ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ముఖ్యంగా ‘రామాయణ’ను కేవలం సినిమాగా కాకుండా భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే ప్రయత్నంగా చూడాలన్న అల్లు అర్జున్ వ్యాఖ్యలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

ఇది కూడా చదవండి: సందీప్ రెడ్డి వంగా ఫైర్.. రాప్తాడు విషాదాన్ని అడ్డం పెట్టుకుని టార్గెట్ చేస్తున్నారు.!

 

 

 

[Allu Arjun Tweet On Ramayana, Allu Arjun Twitter, Ramayana Movie, Ranbir Kapoor, Sai Pallavi, Yash, Allu Arjun, Nitesh Tiwari, Namit Malhotra, Telugu Film News]

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com