Home

»

Latest News

Allu arjun: నా దేవుడు ఆయనే.. అల్లు అర్జున్ రిలీజ్ చేసిన వీడియో వైరల్

Jun 21, 2026 6:10PM

 

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun)తన అప్ కమింగ్ మూవీ 'రాకా'(Raaka)తో అభిమానులకి, ప్రేక్షకులకి మరో సారి ఐ ఫీస్ట్ అనుభూతిని కలిగించాలనే పట్టుదలతో ఉన్నాడు. ప్రస్తుతం రాకా శరవేగంగా షూటింగ్ ని జరుపుకుంటుంది. అల్లు అర్జున్ త్రిబుల్ రోల్స్ లో కనిపిస్తున్నాడనే టాక్ కూడా ఉంది. 

ఈ రోజు  ఫాదర్స్ డే.  దీంతో ప్రపంచవ్యాప్తంగా ఫాదర్స్ డే సంబరాలు అంబరాన్ని తాకుతున్న వేళ, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన తండ్రి, ప్రముఖ అగ్ర నిర్మాత అల్లు అరవింద్‌పై ఉన్న ప్రేమాభిమానాలని వ్యక్తం చేస్తూ అల్లు అరవింద్‌తో గడిపిన కొన్ని అపురూపమైన, అరుదైన క్షణాలతో కూడిన ఒక ప్రత్యేక వీడియోని షేర్ చెయ్యడంతో పాటు ఒక అద్భుతమైన ఫొటోని అభిమానులతో పంచుకున్నాడు. ఈ పోస్ట్‌కి   జోడించిన వ్యాఖ్యలు ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటున్నాయి. "నాకు మా నాన్నే దేవుడు. నేను కంటితో చూడగలిగే, చెవులతో వినగలిగే, నోటితో మాట్లాడగలిగే మరియు చేతితో తాకగలిగే ఏకైక దేవుడు ఆయనే. నా జీవితంలో ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్నానంటే నాకు అన్నీ ప్రసాదించింది ఆయనే. నా ప్రియమైన నాన్నకి ,ప్రపంచంలోని ప్రతి ఒక్క స్వీట్ నాన్నకి  హ్యాపీ ఫాదర్స్ డే" అంటూ అల్లు అర్జున్ రాసుకొచ్చిన భావోద్వేగపూరితమైన మాటలు తండ్రీ కొడుకుల మధ్య ఉన్న బలమైన అనుబంధాన్ని కళ్లకు కట్టాయి.

Also read: మ్యాజిక్ రిపీట్ అవుతుందా!.. మన శంకర వరప్రసాద్ గారుని దాటుతాడా!


ఈ భావోద్వేగ పోస్ట్‌లో మరో విశేషం ఏమిటంటే, ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు గారి అద్భుతమైన స్వరంతో కూడిన ప్రవచన వీడియోని బ్యాక్‌గ్రౌండ్‌లో ఉపయోగించడం. తండ్రి గొప్పతనాన్ని వివరించే చాగంటి గారి ప్రవచనం ఈ వీడియోకు మరింత గాంభీర్యాన్ని, ఎమోషనల్ టచ్‌ తెచ్చిపెట్టింది. 



 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com