
పుష్ప పార్ట్ 1 , పార్ట్ 2 సాధించిన విజయం యొక్క రీ సౌండ్ సినీ అభిమానులు ఉన్నంతకాలం వినపడుతూనే ఉంటుంది. అందుకు ప్రధాన కారకులు అల్లు అర్జున్, సుకుమార్ అనే విషయం తెలిసిందే. రీసెంట్ గా భారతీయ చలనచిత్ర రంగాన అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల వేడుక గుజరాత్‌లోని కెవాడియాలో నిర్వహించబడింది.
భారత గౌరవ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా 'పుష్ప 2: ది రూల్' చిత్రానికి గాను సుకుమార్ ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్‌ప్లే' (Best Original Screenplay) కేటగిరీలో ప్రతిష్టాత్మక జాతీయ అవార్డుని స్వీకరించారు. ఈ విజయంపై అల్లు అర్జున్ 'ఎక్స్' వేదికగా స్పందిస్తూ "నా గురువు, నా దర్శకుడు సుకుమార్ గారికి హృదయపూర్వక అభినందనలు! నేను ఈ క్షణం కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నాను. ఆయన సాధించిన ఈ అవార్డు నాకు నా సొంత అవార్డు వచ్చినంత సంతోషాన్ని, అనుభూతిని ఇస్తోంది. చివరికి మేమిద్దరం 'పుష్ప' ఫ్రాంచైజ్ ద్వారా జాతీయ అవార్డులు అందుకోవడం ఎంతో గర్వంగా, భావోద్వేగంగా ఉంది. నా హృదయపూర్వక కృతజ్ఞతలు" అంటూ ఎక్స్ వేదికగా ట్వీట్ చేసాడు.
ఇది కూడా చదవండి: సీఎం రేవంత్ రెడ్డికి నాని స్పెషల్ రిక్వెస్ట్: ఆ హీరో ప్యారడైజ్ చూడటానికి పర్మిషన్ ఇస్తారా!

అంతకుముందు 69వ జాతీయ అవార్డుల్లో 'పుష్ప: ది రైజ్' చిత్రానికిగానూ అల్లు అర్జున్ ఉత్తమ నటుడిగా అవార్డు అందుకుని, జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడి అవార్డు గెలుచుకున్న తొలి తెలుగు నటుడిగా చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే పుష్ప రెండో భాగంతో సుకుమార్ ఉత్తమ స్క్రీన్‌ప్లే విభాగంలో జాతీయ అవార్డు గెలుచుకోవడం ఈ చిత్ర యూనిట్‌కు మాత్రమే కాకుండా, సమస్త తెలుగు చిత్ర పరిశ్రమకి దక్కిన గొప్ప గౌరవంగా భావించవచ్చు.
[Allu Arjun, Allu Arjun About Sukumar National Award Win, Pushpa 2 Best Screenplay, 72nd National Film Awards, Telugu Cinema, Telugu Cinema News, Tollywood, Tollywood News]






