Home

»

Latest News

Allu arjun: పేరెంట్స్ చనిపోవడంతో హోటల్‌లో అల్లు అర్జున్ క్లాస్‌మేట్‌

Mar 17, 2026 3:28PM

 


-సోషల్ మీడియాలో వైరల్ గా మారిన న్యూస్ 
-అభిమానుల రియాక్షన్ ఏంటి 
-ఆ క్లాస్ మేట్ ఎవరు

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)అనే పేరుకి ఉన్న బ్రాండ్ కెపాసిటీ ఏ పాటిదో తెలిసిందే. దీంతో అల్లు అర్జున్ నామస్మరణ లేకుండా సోషల్ మీడియాకి పొద్దు పొడవని పరిస్థితి. అభిమానులతో పాటు ఇండియన్ సినీ సర్కిల్స్ లో కూడా సేమ్ సిట్యువేషన్. ఎప్పటికప్పుడు అల్లు అర్జున్ కి సంబంధించిన కొత్త న్యూస్ కోసం వెతకడం వాళ్లందరికీ రోజు వారి దినచర్యలో భాగం. ఈ క్రమంలో లేటెస్ట్ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. దీంతో సోషల్ మీడియాతో పాటు వాళ్లందరికీ సరికొత్త జోష్ వచ్చినట్లయింది.ఆ న్యూస్ ఏంటో చూద్దాం.


అల్లు అర్జున్ ఇంటర్మీడియట్‌లో ఉన్నప్పుడు  క్లాస్‌లో తన పక్కన కూర్చునే అబ్బాయి చాలా సైలెంట్‌గా ఉండేవాడు. అల్లు అర్జున్, ఆ అబ్బాయి స్కూల్ కి వచ్చినప్పుడు,వెళ్ళేటప్పుడు మాత్రమే పలకరించుకునే వాళ్ళు. ఒకసారి ఫ్రెండ్  నాలుగైదు రోజులు కాలేజీకి రాలేదు. ఏమైందని ఆరా తీస్తే అతని పేరెంట్స్ చనిపోయారని తెలిసింది. దీంతో అల్లు అర్జున్ చాలా బాధపడ్డాడు. కొన్ని రోజుల తర్వాత   ఒక హోటల్‌కి వెళితే తన క్లాస్‌ మేట్‌ హోటల్లో పని చేస్తూ కనిపించాడు. ఇక్కడేంటి అని అడిగితే, పేరెంట్స్ లేరు, ఫీజు కట్టలేని, చదువు మానేస్తున్నా అని అతను చెప్పాడు . దీంతో అల్లు అర్జున్.ఇంటికెళ్లి తల్లి నిర్మల(Allu Nirmala)తో విషయాన్ని చెప్పడంతో ఆమె వెంటనే ఫ్రెండ్  ని ఇంటికి తీసుకురమ్మని చెప్పింది. అతన్ని  తన సొంత బిడ్డలా భావించి, అతడి బాధ్యతని తీసుకుని వాళ్ళ ఇంట్లోనే ఉంచి చదివించారు. 


also read: Rashmika Mandanna: రష్మిక ఆసక్తికర పోస్ట్.. ఆ హీరో నా టీం మెంబర్


ఒక తల్లిగా ఆమె తీసుకున్న ఈ నిర్ణయం అల్లు అర్జున్‌పై తీవ్ర ప్రభావం చూపింది. కష్టాల్లో ఉన్న స్నేహితుడిని ఆదుకోవడం ఎంత గొప్ప విషయమో అల్లు అర్జున్ కి ఆ రోజే అర్థమైంది. పైగా స్నేహితులు చాలా ముఖ్యమని కూడా నిర్మల గారు చెప్పడంతో నేటికీ స్నేహానికి ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళ మంచి చెడులు అల్లు అర్జున్  చూసుకుంటు ఉంటాడు. ఇప్పుడు ఈ న్యూస్ నే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సినిమాల విషయానికి వస్తే అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీని శరవేగంగా పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ఈ సినిమా తర్వాత లోకేష్ కనగరాజ్ తో చేయబోతున్నాడు. ఈ మేరకు అధికార ప్రకటన రావడంతో పాటు ఈ సంవత్సరమే షూటింగ్ స్టార్ట్ కానుంది.

 

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com