Home

»

Latest News

రామ్‌చరణ్‌కు పదేళ్లు పట్టింది.. అఖిల్ ఆరో సినిమాలోనే చేశాడు.. నాగార్జున ఆసక్తికర వ్యాఖ్యలు!

Nov 10, 2026 1:54PM

అక్కినేని నాగార్జున సమర్పణలో తెరకెక్కుతున్న కొత్త సినిమా ‘ఇట్లు అర్జున’. అనీష్, అనశ్వర రాజన్ జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి మహేష్ ఉప్పాల దర్శకత్వం వహిస్తున్నారు. నవంబర్ 13న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో నిర్వహించిన మ్యూజికల్ కాన్సర్ట్‌లో నాగార్జునతో పాటు మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, అఖిల్ పాల్గొన్నారు. ఈ వేడుకలో నాగార్జున చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు టాలీవుడ్‌లో ఆసక్తికరంగా మారాయి.

ఈ సినిమాలో హీరో అనీష్ మూగవాడి పాత్రలో నటిస్తున్నారు. తొలి సినిమాతోనే ఇలాంటి ఛాలెంజింగ్ పాత్రను ఎంచుకోవడంపై నాగార్జున ప్రత్యేకంగా ప్రశంసించారు. అనీష్ తన సినిమా గ్లింప్స్ తీసుకొచ్చి వాయిస్ ఓవర్ ఇవ్వమని అడిగారని, అది తనకు నచ్చడంతో వాయిస్ ఓవర్ ఇచ్చానని నాగ్ తెలిపారు. అయితే డెబ్యూ సినిమాకే మూగవాడి పాత్ర చేయడం అవసరమా? అని తాను అనీష్‌ను అడిగానని చెప్పారు. ఎందుకంటే అలాంటి పాత్రల్లో మాటలు లేకపోయినా కళ్లతో, శరీర భాషతో భావాలను పలికించాల్సి ఉంటుందని వివరించారు.

ఈ సందర్భంగా రామ్ చరణ్, అఖిల్ సినిమాలను ఉదాహరణగా చెబుతూ నాగార్జున ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రామ్ చరణ్ ‘రంగస్థలం’ సినిమాలో చెవిటి వ్యక్తి పాత్ర చేయడానికి పదేళ్లు పట్టిందని, అఖిల్ తన ఆరో సినిమా ‘లెనిన్‌’లో అంధుడి పాత్రలో నటించాడని గుర్తుచేశారు. ఇలాంటి విభిన్నమైన పాత్రలు చేయడం అంత సులభం కాదని అనీష్‌కు చెప్పానన్నారు. అయితే అనీష్ తన పాత్రలో పూర్తిగా లీనమై నటించాడని, కళ్లతోనే మాట్లాడాడని ప్రశంసించారు. అతడి మౌనం కూడా తెరపై ఎంతో ప్రభావవంతంగా ఉంటుందని పేర్కొన్నారు.

ఇక సినిమా చూసిన తర్వాత తాను ఎంతో ఆశ్చర్యపోయానని నాగార్జున వెల్లడించారు. అనీష్ అద్భుతంగా నటించాడని, తెరపై అనీష్‌, అనశ్వర రాజన్ మధ్య కెమిస్ట్రీ కూడా చాలా బాగుందని చెప్పారు. దర్శకుడు మహేష్ ఉప్పాల, నిర్మాత వెంకీ కుడుముల సహా సాంకేతిక బృందం ప్రతి ఒక్కరూ తమ బాధ్యతలను చక్కగా నిర్వర్తించారని ప్రశంసించారు. ముఖ్యంగా సంగీత దర్శకుడు తమన్ అందించిన పాటలు తనకు బాగా నచ్చాయని, ‘లెనిన్’ సినిమాకు కూడా ఇలాంటి మంచి పాటలు ఇవ్వలేదేంటి అంటూ తమన్‌తో సరదాగా అన్నానని తెలిపారు.

ఇది కూడా చదవండి: నలుగురు మహిళలపై లైంగిక దాడులు చేసిన న‌టుడు.. క‌ఠిన శిక్ష విధించిన కోర్టు.!

ఈ వేడుకకు హాజరైన రామ్ చరణ్ గురించి కూడా నాగార్జున ప్రత్యేకంగా మాట్లాడారు. తాను కలిసిన మంచి మనుషుల్లో చరణ్ ఒకరని, ఎంతో హుందాగా, వినయంగా ఉంటారని ప్రశంసించారు. తాను రామ్ చరణ్‌ను పెద్దబ్బాయి అని పిలుస్తానని, కానీ చరణ్ మాత్రం తనను అన్నయ్య అని పిలుస్తాడని సరదాగా చెప్పారు. తమ ఇద్దరి మధ్య ఉన్న అనుబంధం ప్రత్యేకమైనదని పేర్కొంటూ రామ్ చరణ్‌ను తన తమ్ముడిగా పరిచయం చేశారు. ఇక ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ రాలేకపోయారని, అయితే ‘ఇట్లు అర్జున’ ట్రైలర్‌ను ఆయనే లాంచ్ చేశారని నాగార్జున కృతజ్ఞతలు తెలిపారు.

ఇక ‘ఇట్లు అర్జున’ సినిమాపై నాగార్జున ఎంతో నమ్మకంగా ఉన్నారు. అనీష్ నటన, అనశ్వర రాజన్‌తో కెమిస్ట్రీ, తమన్ సంగీతం ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు. నవంబర్ 13న సినిమా విడుదల కానున్న నేపథ్యంలో ప్రేక్షకుల ఆశీస్సులు కోరారు. ఒక కొత్త హీరో తన తొలి సినిమాతోనే మూగవాడి పాత్రను ఎంచుకుని మెప్పించాడంటూ నాగార్జున చేసిన ప్రశంసలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. మరి ఈ విభిన్నమైన కథతో ‘ఇట్లు అర్జున’ ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

మీకు నచ్చవచ్చు: విడుదలకు సిద్ధమైన మోహన్‌లాల్ సినిమా.. ఇంతలోనే విషాదం.! 

 

 

 

[Akkineni Nagarjuna Speech, Itllu Arjuna Movie, Ram Charan Rangasthalam, Akhil Lenin Movie, Aneesh Itllu Arjuna, Anaswara Rajan, Nagarjuna Ram Charan, Nagarjuna Akhil, Venkuy Kudumula, Mahesh Uppala, Thaman Music, Itllu Arjuna Musical Concert, Telugu Cinema News]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com