TeluguOne App Promotion
● # Tweets

Home

»

తాజా

నటించలేకపోతున్నాననే బాధ లేదు..పునర్జన్మ వచ్చింది

Jun 3, 2024 3:58PM

ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ కలిపితేనే సినిమా. వాళ్ళల్లో ఎప్పుడు ఎవరి రేంజ్ ఏ  స్థాయికి వెళ్తుందో చెప్పలేం. సింపుల్ గా చెప్పాలంటే టైం కోసం ఎదురుచూస్తుంటారు.టైం వచ్చాక  టైం లేకుండా గడుపుతారు. అలాంటి వాళ్లలో ప్రముఖ నటుడు అజయ్ ఘోష్ కూడా ఒకడు.వర్సటైల్  యాక్టర్ గా తనదైన శైలిలో ముందుకు దూసుపోతున్నాడు. తాజాగా  పుష్ప 2 గురించి కొన్ని వ్యాఖ్యలు చేసాడు. ఇప్పుడు అవి ఆయన స్థాయిని తెలియచేస్తున్నాయి.

అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో 2021 లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూవీ పుష్ప. ఇప్పుడు దానికి కొనసాగింపు గా పుష్ప 2  తెరకెక్కుతుంది.మొదటి భాగంలో నటించిన చాలా మంది సీక్వెల్‌ లో నటిస్తున్నారు.ఇప్పుడు ఈ విషయం మీదనే  ఒక ఇంటర్వ్యూ లో పాల్గొన్న  అజయ్‌ ఘోష్  చెప్పిన మాటలు పలువుర్ని ఆలోచింపచేస్తున్నాయి. పుష్ప 2 లో నా పాత్ర లేదు.. నేను నటించలేక పోతున్నానే బాధ లేదు. ఎందుకంటే ఇంక  నా సినీ  కెరీర్‌ ఖతం  అయ్యింది అనుకుంటున్న టైం లో  పుష్ప  వన్ లో అవకాశం వచ్చింది. అందులోని  కొండా రెడ్డి  పాత్ర నటుడుగా నాకు  పునర్జన్మని  ఇచ్చింది.  ఆ సంతృప్తి చాలని చెప్పుకొచ్చాడు. 

మొదటి భాగంలో కొండా రెడ్డి క్యారక్టర్ చనిపోతుంది. దీంతో ఆయన పార్ట్ 2 లో నటించే అవకాశం లేదు.సోషల్ మీడియా లో ఆయన ఇంటర్వ్యూ చూసిన చాలా మంది అజయ్  ఘోష్ పుష్ప 2 లో నటించాలని, వేరే క్యారక్టర్ కి తీసుకున్నా బాగుండేదని అంటున్నారు. ఏది ఏమైనా పుష్ప ఇచ్చిన ఉత్సాహంతో  అజయ్ ఘోష్ ఇప్పుడు  చేతి నిండా సినిమాలతో ఫుల్  బిజీగా ఉన్నాడు. వేరే నటుడి క్యారక్టర్ చూసి ఆ క్యారక్టర్ అజయ్ ఘోష్ చేస్తే బాగుండు అనే రేంజ్ కి కూడా వెళ్ళాడు. 2010 లో ప్రస్థానం తో సినీ ప్రస్థానాన్ని ప్రారంభించి ఇప్పటి వరకు 40 సినిమాలకి పైనే చేసాడు. వాటిల్లో ఇతర బాషా చిత్రాలు కూడా ఉన్నాయి.

 

google-ad-img