ఓటీటీలోకి అదాశర్మ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
on May 9, 2024
ది కేరళ స్టోరీ మూవీతో సంచలనం సృష్టించిన నటి అదాశర్మ. తెలుగులో ఎన్నో సినిమాలు చేసిన ఈ భామ.. ' ది కేరళ స్టోరీ' మూవీతో సక్సెస్ ని అందుకుంది.
అదాశర్మ వరుస బ్లాక్ బస్టర్ హిట్లతో అదా శర్మ నేషనల్ వైడ్గా ట్రెండ్ అవుతుంది. డిఫరెంట్ కాన్సెప్ట్లతో ఆడియెన్స్ ముందుకు వచ్చి అందరినీ మెప్పిస్తుంది. హారర్, యాక్షన్, ఎమోషన్ ఇలా అన్ని రకాల కాన్సెప్ట్లతో అదాశర్మ ప్రయోగాలు చేస్తున్నారు. ఇక చాలా గ్యాప్ తరువాత అదాశర్మ తెలుగులో ఓ స్ట్రెయిట్ సినిమాను చేస్తోంది. రీసెంట్ గా తెలుగు ప్రేక్షకుల ముందుకు అదాశర్మ ‘C.D క్రిమినల్ ఆర్ డెవిల్’ అనే సినిమా ద్వారా వస్తున్నట్లు ట్రైలర్ రిలీజ్ చేసారు మేకర్స్. ఇక ఈ సినిమాలో అదా లీడ్ రోల్ పోషిస్తుండటం విశేషం. అయితే ఇప్పుడు అదాశర్మ నటించిన 'బస్తర్ ' ఓటీటీలో స్ట్రీమింగ్ కి సిద్ధంగా ఉంది. సుదీప్తో సేన్, విపుల్ అమృత్ లాల్ తెరకెక్కించిన మూవీ 'బస్తర్'. మార్చి నెలలో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ కి సిద్దంగా ఉంది. ప్రముఖ ఓటీటీ వేదిక జీ5 లో ఈ నెల 17 నుండి స్ట్రీమింగ్ అవుతున్నట్లు మేకర్స్ తెలిపారు.
మావోయిస్టుల నేపథ్యంలో సాగే ఈ బస్తర్ లో ఐపీఎస్ అధికారిగా అదాశర్మ కన్పించింది. బస్తర్ ప్రాంతంలోని సామాన్యులపై మావోయిస్టుల పెత్తనం.. వారిని అణచివేయడానికి స్పెషల్ ఆఫీసర్ ఇలా కథ మొత్తం.. మావోయిస్టులు, పోలీసుల చుట్టూ తిరుగుతుంది. ఇక మిగతా కథేంటో తెలియాలంటే ఓటీటీలో చూడాల్సిందే. ఢిఫరెంట్ జానర్ సినిమాలని చేస్తూ అదాశర్మ సత్తా చాటుకుంటోంది.
Also Read