Home

»

Latest News

ప్రియుడితో బ్రేకప్.. ఇన్ స్టాలో ఫోటోస్ డిలీట్ చేసిన టాలీవుడ్ హీరోయిన్

Jun 16, 2026 5:30PM

 


ప్రేమలు, పెళ్లిళ్లు ఎంత వేగంగా జరుగుతున్నాయో, అంతే వేగంగా బ్రేకప్‌లు, విడాకులు  చోటుచేసుకుంటున్నాయి. ఇందుకు సినిమా వాళ్ళు అతీతులేమి కాదు. నటీనటుల మధ్య బంధం ఎలా ఉందో తెలుసుకోవడానికి నెటిజన్లు వారి ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లని గమనిస్తున్నారు. ఎవరైనా తమ భాగస్వామి ఫోటోలని  డిలీట్ చేశారంటే చాలు, అక్కడ ఏదో తేడా కొట్టిందంటూ ప్రచారాలు మొదలైపోతాయి. తాజాగా టాలీవుడ్ నటి సునయన విషయంలో కూడా సరిగ్గా ఇదే జరిగింది. తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ప్రియుడికి సంబంధించిన ఫోటోలని తొలగించడంతో ఒక్కసారిగా సోషల్ మీడియాలో కలకలం రేగింది.

కొన్ని రోజుల క్రితం సునయన(sunaina yella)సోషల్ మీడియా వేదికగా ఒక అపరిచిత వ్యక్తి చేతిని పట్టుకుని ఉన్న ఫోటోని  షేర్ చేస్తూ, ఒక లాక్ ఎమోజీని జోడించింది. ఆమె నిశ్చితార్థం జరిగిందనే వార్తలకి  సదరు పోస్ట్ బలమైన కారణమైంది. ఆ తర్వాత దుబాయ్‌కి చెందిన ప్రముఖ యూట్యూబర్ ఖలీద్ అల్ అమేరి కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో అదే తరహా ఫోటోని  ‘అల్హమ్దులిల్లాహ్’ అనే క్యాప్షన్‌తో పోస్ట్ చేయడంతో వీరిద్దరి మధ్య ప్రేమాయణం, నిశ్చితార్థం దాదాపు ఖాయమని అంతా భావించారు. అయితే తాజాగా సునయన తన ఇన్‌స్టాగ్రామ్ పేజీ నుండి ఆ ఫోటోలని ,తన ప్రియుడికి సంబంధించిన పోస్ట్‌లని  పూర్తిగా డిలీట్ చేసింది. సాధారణంగా సెలబ్రెటీలు తమ రిలేషన్‌షిప్‌కి  ముగింపు పలికినప్పుడు లేదా మనస్పర్థలు వచ్చినప్పుడు మొదట చేసే పని ఇన్‌స్టాగ్రామ్ నుండి ఫోటోలు తొలగించడమే. సునయన కూడా అదే బాటలో పయనించడంతో, ఆమె తన ప్రియుడితో బ్రేకప్ చెప్పేసిందంటూ వార్తలు చల్ చేస్తున్నాయి. అన్‌ఫాలో చేసుకున్నారనే రూమర్స్ కూడా వినిపిస్తున్నాయి. గతంలో ఖలీద్ అల్ అమేరి తన మొదటి భార్య సలామా మహ్మద్‌తో విడాకులు తీసుకున్నట్లు అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. సునయనతో ఆయన సరికొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నారని అభిమానులు ఆశించారు.

Also read: ఆ సూపర్ హిట్ మూవీ కథలు నావే.. మాజీ ఐపీఎస్ అధికారిణి సంచలనం

సునయన తెలుగులో 'కుమార్ వర్సెస్ కుమారి', 'సమ్‌థింగ్ సమ్‌థింగ్' వంటి చిత్రాలతో పాటు తమిళంలో ‘కాదలిల్ విజుంతేన్’ వంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఎప్పుడూ వివాదాలకు దూరంగా ఉండే ఈ బ్యూటీ, ఇలా హఠాత్తుగా ఇన్‌స్టాగ్రామ్ నుండి ఫోటోలు డిలీట్ చేయడం వెనుక అసలు కారణం ఏంటనేది ఇప్పుడు మిస్టరీగా మారింది. ఇది నిజంగానే బ్రేకపా? లేక వ్యక్తిగత ప్రైవసీ కోసమే ఆమె ఆ ఫోటోలను తొలగించిందా అన్నది తెలియాల్సి ఉంది. ఈ వ్యవహారంపై సునయన నుండి అధికారిక స్పందన వస్తేనే గానీ ఈ సస్పెన్స్‌కి  తెరపడేలా లేదు.

 

 


 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com