Home

»

Latest News

Prema: ఆ స్టార్ హీరోతో లవ్ అంటూ రూమర్స్.. ఎట్టకేలకు ఓపెన్ అయిన ప్రేమ

Jun 22, 2026 1:05PM

 

 

'కుంకుమ పూల తోటలో కులికే ఓ కుమారి' అనే సాంగ్ తో పాటు ఎన్నో అపురూపమైన  హిట్ సాంగ్స్ తో అభిమానులు, ప్రేక్షకుల మనస్సులో భద్రంగా కొలువురు తేరిన నటి ప్రేమ. హీరోయిన్ గా  తెలుగుతో పాటు  తమిళ, కన్నడ భాషల్లో తన ట్రాక్ రికార్డు ఎంతో ఘనమైనది.  అయితే, కెరీర్ పీక్స్ లో ఉన్న సమయంలో కన్నడ స్టార్ హీరో ఉపేంద్రతో ప్రేమకి లవ్ ఎఫైర్ ఉందంటూ పెద్ద ఎత్తున రూమర్స్ వచ్చాయి. చాలా కాలంగా చిత్ర పరిశ్రమకి  దూరంగా ఉంటున్న ప్రేమ, ఇటీవల ఇచ్చిన ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆ  గాసిప్స్‌పై, అలాగే ప్రస్తుతం తను సినిమాలని  ఎందుకు తిరస్కరిస్తుందో వెల్లడి చేసారు 

ఆమె మాట్లాడుతు అసలు ఆ రూమర్స్ ఎవరు సృష్టించారో, ఎవరు రాశారో వాళ్లనే అడగాలి  ఒక హీరోయిన్‌గా కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్నప్పుడు అలాంటి వదంతులు రావడం చాలా సహజం. కానీ ఆ వార్తలు రాసేముందు ఎవరూ నాతో మాట్లాడలేదు. ఈ విషయమై నేను  కానీ, హీరో ఉపేంద్ర కానీ ఎప్పుడూ కూర్చొని చర్చించుకోలేదు. నా దృష్టి, ఫోకస్ ఎప్పుడూ కేవలం నటన మీదే ఉండేది. గాసిప్‌లకి అస్సలు ప్రాధాన్యత ఇవ్వను. విజయం సాధించినప్పుడు విమర్శలు, వదంతులు రావడం కూడా సాధారణమే. వాటిని నేను  ఒక సవాలుగా తీసుకుంటాను.

Also read: VIjay: ఈ రోజు విజయ్ పుట్టిన రోజు.. ఆ ఆలయంలో భారీ ఎత్తున పూజలు 


అదే సమయంలో, ఉపేంద్ర దర్శకత్వంలో వచ్చిన 'ఓం', 'ఉపేంద్ర' వంటి సినిమాల్లో నటించడం ఎంతో పెద్ద సవాలుతో కూడుకున్నఅనుభవం. ఎందుకంటే  ఉపేంద్రతో కలిసి పని చేయడం చాలా కష్టతరమైన విషయం. ఒకానొక సీన్‌లో తనను ఇంట్లోంచి లాక్కెళ్లి పడేసే సమయంలో నిజంగానే ప్రాణం పోతుందేమోనని భయపడ్డాను. కానీ కెమెరా ఆన్ అయినప్పుడు, ప్రేక్షకులు చూస్తున్నారనే ఒకే ఒక్క భావనతో ధైర్యంగా ఆ సీన్ పూర్తి చేశానని చెప్పారు. 

 

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com