TeluguOne App Promotion
● # Tweets

Home

»

తాజా

హేమ రేవ్ పార్టీలో డ్రగ్స్ తీసుకుంది.. పోలీసులు నిర్దారణ

May 23, 2024 2:13PM

మొన్న బెంగుళూర్ (bangalore) లో జరిగిన రేవ్ పార్టీ (rave party) విషయం ఎంతగా సంచలనం సృష్టించిందో  అందరకి తెలిసిందే.  పలువురు సినీ సెలబ్రిటీస్ అందులో పాల్గొన్నారని పేరు వచ్చింది. అందులోను  మరి ముఖ్యంగా ప్రముఖ నటి హేమ (hema)కూడా ఉండటంతో కేసు ఆసక్తిగా మారింది. ఇప్పుడు  కొన్ని సంచలన విషయాలు బయటకి వచ్చాయి

హేమ డ్రగ్స్ తీసుకున్నట్టుగా పోలీసులు నిర్దారించారు. ఆమె రక్త నమూనాలని పరీక్షకి పంపించగా పాజిటివ్  రిపోర్ట్ వచ్చింది. ఈ మేరకు బెంగుళూర్ పోలీసులు అధికారకంగా ప్రకటించారు. దీంతో తెలుగు చిత్ర పరిశ్రమ ఒక్కసారిగా  షాక్ కి గురయ్యింది. అలాగే  ఆ పార్టీలో పాల్గొన్న ఎనభై ఏడు మంది డ్రగ్స్ తీసుకున్నట్టు   పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది. ఇప్పుడు ఈ విషయం ఇండియా మొత్తం హాట్ టాపిక్ అయ్యింది. అంత మంది కలిసి ఒక పార్టీ లో డ్రగ్స్ తీసుకోవడం అందరకి పాజిటివ్ రావడం బహుశా ఇదే తొలిసారి కావచ్చు. తెలుగు రాష్ట్రాలకి చెందిన  మరికొంత మంది సినీ, రాజకీయ ప్రముఖులు కూడా వీరిలో ఉన్నారు. వాళ్ల పేర్లు కూడా త్వరలోనే బయటకి రానున్నాయి

ఇక హేమ డ్రగ్స్ కేసులో పట్టుబడిన దగ్గర్నుంచి నేను రేవ్ పార్టీ లో లేనని చెప్పుకుంటు వస్తుంది. హైదరాబాద్ లోనే ఉన్నానని చెప్పడంతో పాటు తన ఇంట్లోనే  బిర్యానీ కూడా తయారు చేసినట్టు వీడియోలు చేసింది. ఈ విషయం మీద కూడా పోలీసులు సీరియస్ గా ఉన్నారు.1989 లో సినీ రంగ ప్రవేశం చేసిన హేమ ఇప్పటివరకు నూట తొంబై చిత్రాలకి పైనే చేసింది 

 

google-ad-img