TeluguOne App Promotion
● # Tweets

Home

»

తాజా

ప్రముఖ నటి అనుమానాస్పద మృతి.. కుళ్ళిన స్థితిలో మృతదేహం..!

Jun 10, 2024 4:59PM

ప్రముఖ నటి నూర్‌ మాళవికా దాస్‌ (32) అనుమానాస్పద రీతిలో మృతి చెందింది. ముంబైలోని ఓ అపార్ట్‌మెంట్‌ లో అద్దెకు ఉంటున్న ఆమె.. తన ఫ్లాట్ లోనే ఫ్యాన్ కి ఉరి వేసుకొని మరణించింది. నూర్‌ చనిపోతే కనీసం పట్టించుకున్న వారు కూడా లేరు. ఆ ఫ్లాట్ నుంచి దుర్వాసన వస్తుండటంతో.. పొరుగింటివారు పోలీసులకు సమాచారం అందించారు.  కుళ్ళిన స్థితిలో ఉన్న ఆమె మృత దేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టారు. మరోవైపు నూర్ ని చూడటానికి ఆమె కుటుంబ సభ్యులు రాకపోవడం పలు అనుమానాలను దారితీస్తోంది. 

అసోంకు చెందిన మాళవికా ఎయిర్‌ హోస్టెస్‌గా కెరీర్ ప్రారంభించింది. ఆ తర్వాత నటనపై ఇష్టంతో సినీ పరిశ్రమకు వచ్చి.. పలు సినిమాలు, సిరీస్ లలో నటించింది. 'ది ట్రయల్‌' అనే వెబ్ సిరీస్ లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. నటిగా ఎదుగుతున్న సమయంలో.. చిన్న వయసులోనే ఆమె మరణించడం షాకింగ్ గా మారింది.

google-ad-img