Home

»

Latest News

త్రిష ప్లేస్ లో నేనుంటే: విజయ్, త్రిష రిలేషన్ పై సీనియర్ నటి అంబిక సంచలన వ్యాఖ్యలు!

Sep 16, 2026 2:26PM

 

 

ఇళయ దళపతి విజయ్, త్రిష లండన్  పిక్స్ వైరల్ గా మారిన విషయం తెలిసిందే. త్రిష వచ్చినప్పుడు విజయ్ తన చూపుని పక్కకి తిప్పుకోవడమే వైరల్ కి ప్రధాన కారణం. ఈ నేపథ్యంలో త్రిష, విజయ్ వ్యవహారంపై  సీనియర్ నటి అంబిక రీసెంట్ గా మాట్లాడుతు 'ఇద్దరు వ్యక్తుల మధ్య ఉండేది కేవలం నిజమైన స్నేహబంధమే అయినప్పుడు, సమాజం లేదా సోషల్ మీడియా దానికి అనవసరమైన రంగులు పులమకూడదు. అయితే అదే సమయంలో, ఒక స్నేహితుడు సమాజంలో అత్యంత బాధ్యతాయుతమైన పదవిలో లేదా ప్రజా సేవలో ఉన్నప్పుడు మనం ప్రవర్తించే తీరుపై ఎంతో విచక్షణ, జాగ్రత్త అవసరం.

'ఒకవేళ నేను గనుక త్రిష స్థానంలో ఉండి ఉంటే, నా వల్ల నా ఆప్తమిత్రుడి రాజకీయ జీవితానికి గానీ, పబ్లిక్ ఇమేజ్‌కి గానీ అనవసరపు విమర్శలు వస్తున్నాయని భావిస్తే.. వెంటనే ఆయనతో కలిసి బహిరంగంగా తిరగడం తగ్గించి, కొద్దిగా దూరంగా ఉండేదాన్ని" అలా దూరంగా ఉండటం అంటే ఆ స్నేహాన్ని పూర్తిగా తెంచుకోవడం లేదా ముగించడం అని అర్థం కాదు. కేవలం ఒకరి ప్రజా జీవితంపై ఎదుటివారి వల్ల ప్రతికూల ప్రభావం పడకుండా చూసుకోవడమే నిజమైన మైత్రికి నిదర్శనమని వివరించారు.

 

 

Also Read: పదేళ్ల ప్రేమని దక్కించుకున్న హీరోయిన్: పెళ్లి పిక్స్ వైరల్..వరుడు ఏం చేస్తాడో !


అంబికా ఎవరో కాదు తన అందచందాలతో 1970, 80వ దశకాల్లో తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో స్టార్ హీరోయిన్‌ హోదాలో అశేష అభిమానులని సంపాదించింది. ముఖ్యంగా చిరంజీవి నుంచి వచ్చిన యముడికి మొగుడులో స్వర్గలోకంలో చిరుతో కలిసి చేసిన స్టెప్స్ ఎవరు మర్చిపోలేరు. అలనాటి స్టార్ హీరోయిన్ 'రాధ' కి అంబికా స్వయానా అక్క. ఇక అభిమానులు, నెటిజెన్స్ సోషల్ మీడియా వేదికగా విజయ్, త్రిష వ్యవహారంపై స్పందిస్తు విజయ్ క్యాజువల్ గా పక్కకి తిరిగాడు. ఆ టైంలో త్రిష వచ్చింది అంతే. అయినా మాటి మాటికి అభిమానం,మర్యాద, ఆప్యాయతని చూపించుకుంటూ ఉండటానికి ఆ ఇద్దరు ఏమైనా పేయింగ్ గెస్ట్ లా, కొంత మంది ఏ పని పాట లేకుండా అనవసరపు కామెంట్స్ చేస్తున్నారు. కొంత మంది ఏ పని పాట లేకుండా అనవసరపు కామెంట్స్ చేస్తున్నారు. ఎలక్షన్స్ కి ముందే విజయ్, త్రిష బంధంపై కామెంట్స్ వస్తే త్రిష ని తీసుకొని విజయ్ బహిరంగంగా ఒక ఫంక్షన్ కి హాజరయ్యాడు. తమిళ ప్రజలు భారీ మెజారిటీ తో పదవి కట్టబెట్టారని మర్చిపోకండనే కామెంట్స్ చేస్తున్నారు.

 

 

 

[Vijay, Trisha, Ambika, Vijay And Trisha Friendship, London, Telugu Cinema, Telugu Cinema News, Tollywood, Tollywood News]


 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com