ప్రముఖ నటుడు, నిర్మాత, దర్శకుడు గిరిబాబు(83) కన్నుమూశారు. గత కొంతకాలంగా వయసు రీత్యా వచ్చిన ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన నవంబర్ 14 సాయంత్రం తుది శ్వాస విడిచారు.
1946 జూన్ 8న ప్రకాశం జిల్లా, రావినూతల గ్రామంలో జన్మించారు గిరిబాబు. ఆయన అసలు పేరు యర్రా శేషగిరిరావు. 1973లో విడుదలైన ‘జగమే మాయ’ చిత్రం ద్వారా నటుడుగా పరిచమయ్యారు గిరిబాబు. 2016 మే 12న ఆయన భార్య శ్రీదేవి కిడ్నీ సమస్యలతో బాధపడుతూ కన్నుమూశారు. ఆయనకు ఇద్దరు కుమారులు. రఘుబాబు, బోసుబాబు. రఘుబాబు హాస్యనటుడిగా అందరికీ సుపరిచితుడే.
1977లో విడుదలైన ‘దేవతలారా దీవించండి’ చిత్రం ద్వారా నిర్మాతగా మారారు గిరిబాబు. నాలుగు దశాబ్దాలకు పైగా నటుడిగా కొనసాగిన గిరిబాబు మొత్తం 600 సినిమాల్లో నటించారు.
గిరిబాబు మరణంతో చిత్ర పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆయన మృతి పట్ల చిత్ర ప్రముఖులు తమ సంతాపాన్ని తెలియజేస్తున్నారు.






