జగన్ కి ఝలక్.. వైసీపీకి అలీ రాజీనామా...
on Jun 28, 2024
'వై నాట్ 175' అంటూ ఎన్నికల బరిలోకి దిగి, కేవలం 11 ఎమ్మెల్యే సీట్లకు పరిమితమైన వైసీపీ అధినేత వైఎస్ జగన్ కు మరో ఝలక్ తగిలింది. వైసీపీకి ప్రముఖ నటుడు, కమెడియన్ అలీ రాజీనామా చేశారు.
అలీ కొన్నేళ్లుగా వైసీపీలో ఉన్నారు. అయితే ఆ పార్టీలో అలీ కీలకంగా ఉన్నప్పటికీ, ఎంతో కష్టపడి పార్టీ తరపున ప్రచారం చేసినప్పటికీ.. ఆయన ఆశించిన పదవులు మాత్రం దక్కలేదనే చెప్పాలి. ఇక ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం తర్వాత సైలెంట్ అయిన అలీ.. తాజాగా సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. సినీ పరిశ్రమ వల్లే తాను ఇంతటి వాడిని అయ్యాయని చెప్పిన అలీ.. కేవలం సేవ చేయడం కోసమే రాజకీయాల్లోకి వెళ్లాలని అన్నారు. ఇక నుంచి తాను ఏ రాజకీయ పార్టీకి చెందిన వాడిని కాదని, రాజకీయాలకు స్వస్తి చెప్పి, సినిమాలపైనే తన పూర్తి దృష్టి పెడతానని చెప్పారు.
![]( https://www.teluguone.com/images/g-news-banner.gif)
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
![](https://www.teluguone.com/tmdb/images/read-1.jpg)