ఆరుగురు పతివ్రతలు రీ-రిలీజ్: టీజర్ లాంచ్ చేసిన ఆర్యన్ రాజేష్.. మళ్ళీ సెన్సేషన్ అవుతుందా.?
Nov 25, 2026 1:37PM

దివంగత దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో 2004లో విడుదలై ప్రేక్షకుల నుంచి మంచి స్పందన అందుకున్న చిత్రం ‘ఆరుగురు పతివ్రతలు’. పోచమ్మ ఫిల్మ్స్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా ఈ సినిమా మరోసారి డిసెంబర్ 11న థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ రీ-రిలీజ్ టీజర్ ను ఈవీవీ తనయుడు, నటుడు ఆర్యన్ రాజేష్ లాంచ్ చేశారు.
ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకి కమలాకర్, జనార్ధన్, మహర్షి, నాగిరెడ్డి కీలక బాధ్యతలు నిర్వహించారు. బోల్డ్ కామెడీ కంటెంట్‌తో అప్పట్లో ప్రేక్షకులను అలరించిన ఈ సినిమాలో అమృత, లహరి, చలపతి రావు, ఎల్.బి. శ్రీరామ్, శ్రీకృష్ణ కౌశిక్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.
భార్యాభర్తల మధ్య అనుబంధం, వివాహేతర సంబంధాలు, లైంగిక సమస్యలు, బలవంతపు పెళ్లిళ్లు, సైకో మనస్తత్వం కలిగిన భర్తల ప్రవర్తన వంటి విభిన్న అంశాలతో పాటు ప్రేమ, భావోద్వేగాలు, హాస్యాన్ని మేళవిస్తూ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

ట్రైలర్ లాంచ్ సందర్భంగా ఆర్యన్ రాజేష్ మాట్లాడుతూ.. “మా నాన్నగారు ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో 2004లో విడుదలైన ‘ఆరుగురు పతివ్రతలు’ సినిమా చాలా సెన్సేషన్ అయింది. ఇప్పుడు మరోసారి ఈ సినిమాను డిసెంబర్ 11న థియేటర్లలో చూసి ప్రేక్షకులు ఆదరించాలని కోరుకుంటున్నాను.” అన్నారు.
ఇది కూడా చదవండి: శ్రీవిష్ణుపై నాని ఫ్యాన్స్ ఫైర్.. మెగా ఫ్యాన్స్ కూడా హర్ట్ అయ్యారు.!
మరోసారి వెండితెరపై సందడి చేయనున్న ‘ఆరుగురు పతివ్రతలు’ సినిమాకి ప్రేక్షకులు ఎలాంటి ఆదరణ అందిస్తారో చూడాలి.
మీకు నచ్చవచ్చు:
నాన్న కుట్టి ట్రైలర్.. కూతురి కోసం ప్రాణాలైనా ఇచ్చే తండ్రి కథ.!
మహేష్ ఫ్యాన్స్‌కి షాక్.. వారణాసి కొత్త రిలీజ్ ప్లాన్ ఇదే.!
[Aaruguru Pativratalu, Re Release, Teaser Launch, Aryan Rajesh, EVV Satyanarayana]



.webp)
