
విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో రూపొందుతున్న మూవీ ‘ఆదర్శ కుటుంబం’ నుంచి సంగీత సందడి కొనసాగుతోంది. ఇప్పటికే విడుదలైన మొదటి సాంగ్ కి కొనసాగింపుగా, సినిమాలోని రెండో సాంగ్ ‘మాలా’ ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తమన్ ఎస్ స్వరపరిచిన ఈ పాట వైవిధ్యమైన సంగీతంతో, కలర్ ఫుల్ విజువల్స్ తో, ఎనర్జిటిక్ డ్యాన్స్ తో ఆకట్టుకుంటోంది.
ఈ పాటలో విక్టరీ వెంకటేష్, నివేదా పేతురాజ్ తమదైన స్క్రీన్ ప్రెజెన్స్‌తో సందడి చేశారు. వీరిద్దరి కెమిస్ట్రీ, హుషారైన స్టెప్పులు, ఉత్సాహభరితమైన అభినయం పాటకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పాటలోని జోష్‌కు తగినట్లుగా రూపొందించిన విజువల్స్ ప్రేక్షకులను అలరిస్తున్నాయి.
‘మాలా’ పాటకు తమన్ ఎస్, ధనుంజయ్ సీపాన, రణినా రెడ్డి గాత్రాన్ని అందించగా, రామజోగయ్య శాస్త్రి సాహిత్యం సమకూర్చారు. భాను మాస్టర్ డ్యాన్స్ కొరియోగ్రాఫర్ గా వ్యవహరించారు.
వెంకటేష్, త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న ఈ సినిమా భావోద్వేగాలు, వినోదం, కుటుంబ అనుబంధాలతో కూడిన కుటుంబ కథాచిత్రంగా రూపొందుతోంది. త్రివిక్రమ్ రచన, దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని హారికా అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్. రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్నారు.
ఈ చిత్రానికి రవి కె. చంద్రన్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తుండగా, నవీన్ నూలి ఎడిటింగ్, ఏఎస్ ప్రకాశ్ ఆర్ట్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
రెండో పాట ‘మాలా’ విడుదలతో సంగీతపరంగా మరో ముందడుగు వేసిన చిత్ర బృందం, త్వరలోనే ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ట్రైలర్‌ను విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది.
ఇది కూడా చదవండి: టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. మన టాలీవుడ్ స్టార్స్ సేఫేనా.?
[Aadarsha Kutumbam Second Single, Maala Song, Aadarsha Kutumbam Movie, Victory Venkatesh, Nivetha Pethuraj, Trivikram Srinivas, Thaman S, Telugu Songs 2026, Telugu Film News]






