Home

»

Latest News

ఆదర్శ కుటుంబం కోసం కాలేజీకి సెలవు: కానీ సాక్షాత్తు విమర్శలు చేస్తుంది ఎవరో తెలుసా! 

Oct 24, 2026 4:04PM


ఒక్కోసారి రెండు వైపుల వాళ్ళు చెప్పే వెర్షన్స్ కరెక్టే కదా అనే పరిస్థితి వస్తుంది.  అందుకు సినిమా అనే పదం వేదిక అయితే సినీ లవర్స్, ప్రేక్షకులు, విశ్లేషకులు బయట వినిపిస్తున్న మాటలని యధావిధిగా చెప్పుకోవాల్సిందే.

విక్టరీ  వెంకటేష్, శ్రీనిధిశెట్టి,త్రివిక్రమ్ ల మోస్ట్ అంటెసిపేటెడ్ మూవీ 'ఆదర్శ కుటుంబం' ట్రైలర్  ఈవెంట్ కార్యక్రమం నిన్న నైట్ హైదరాబాద్ లోని మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ క్యాంపస్‌లో అత్యంత వైభవంగా, కోలాహలంగా జరిగింది. ఈ వేడుకకు కాలేజీ విద్యార్థుల నుంచి ఊహించని స్థాయిలో అపూర్వమైన స్పందన లభించింది. వేలాది మంది విద్యార్థులు కేరింతలతో ప్రాంగణాన్ని హోరెత్తించారు.   అయితే, ఈ ప్రమోషనల్ ఈవెంట్ సందర్భంగా మల్లారెడ్డి కాలేజీల వైస్ ఛైర్ పర్సన్ డాక్టర్ చామకూర ప్రీతి రెడ్డి చేసిన ఒక ప్రకటన ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా పెను సంచలనంగా, వివాదాస్పదంగా మారింది. 

రాబోయే అక్టోబర్ 30వ తేదీన అత్యంత భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు రానున్న 'ఆదర్శ కుటుంబం' చిత్రాన్ని మొదటి రోజే థియేటర్లలో చూస్తామని విద్యార్థులు తమకు బహిరంగంగా మాటివ్వాలని ఆమె కోరారు. విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా, కేకలు వేస్తూ సినిమా చూస్తామని హామీ ఇవ్వడంతో, అక్టోబర్ 30న సినిమా విడుదల రోజున మల్లారెడ్డి విద్యాసంస్థల పరిధిలోని అన్ని కాలేజీలకు అధికారికంగా హాలిడే ప్రకటిస్తున్నట్లు ఆమె మైకులో స్పష్టం చేశారు. అంతేకాకుండా, వేదికపై హీరో వెంకటేష్‌తో కలిసి ఆమె సరదాగా స్టెప్పులేయడం, విద్యార్థులను ఉత్సాహపర్చడం తదితర విజువల్స్ క్షణాల్లో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో వైరల్‌గా మారి విపరీతమైన వ్యూస్‌ను సొంతం చేసుకున్నాయి.   ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన క్షణం నుంచే నెటిజన్లు, విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి తీవ్ర వ్యతిరేకత, ఆగ్రహజ్వాలలు వ్యక్తమవుతున్నాయి. లక్షలాది రూపాయల భారీ ఫీజులు వసూలు చేస్తూ, విద్యార్థులను చదువు వైపు నడిపించాల్సిన యాజమాన్యమే స్వయంగా దగ్గరుండి సినిమాలకు వెళ్లమని ప్రోత్సహించడం ఎంతవరకు సమంజసమని పలువురు తీవ్రంగా నిలదీస్తున్నారు. కాలేజీలు విద్యాబుద్ధులు నేర్పించే ప్రదేశాలా లేక సినిమా ప్రమోషన్లు నిర్వహించే కమర్షియల్ ఏజెన్సీలా అంటూ నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. 

ఇది కూడా చదవండి: సంపూర్ణేష్ బాబు హిట్ మూవీ రీ రిలీజ్: మరి నవంబర్ 14 ముస్తాబు కండి!

 


విద్యార్థుల చదువును పక్కనపెట్టి కేవలం పబ్లిసిటీ కోసం ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం వారి భవిష్యత్తుతో చెలగాటమాడటమేనని అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి విద్యాసంస్థల తీరుపై తెలంగాణ ప్రభుత్వ విద్యాశాఖ అధికారులు వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి. సినిమా యూనిట్లు తమ ప్రొడక్ట్ ప్రమోషన్ల కోసం రకరకాల మార్గాలను ఎంచుకోవడం సహజమే అయినప్పటికీ, ఏకంగా కాలేజీలకు సెలవులు ప్రకటించే స్థాయికి వెళ్లడం ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

 

 

[Aadarsha Kutumbam movie College Holiday Controversy, Malla Reddy College, Aadarsha Kutumbam, Venkatesh movie, Preethi Reddy, TeluguCinema, TeluguCinema News, Tollywood, Tollywood News]
 



 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com