అగ్రహీరోతో సొట్టబుగ్గల సుందరి
on Apr 14, 2014
టాలీవుడ్ లో వరుస అవకాశాలు రాక బాలీవుడ్ కు చెక్కేసిన సొట్టబుగ్గల సుందరి తాప్సీకి అక్కడ మంచి అవకాశాలే వస్తున్నాయి. ఈ అమ్మడికి అక్కడ చిన్న చిన్న సినిమాల్లో అవకాశాలు బాగానే వస్తున్నాయి. ఆ సినిమాలు కూడా మంచి విజయం సాధిస్తుండటంతో భారీ ఆఫర్లు వెతుక్కుంటూ వస్తున్నాయి. తాజాగా బాలీవుడ్ అగ్ర హీరో అక్షయ్ కుమార్ హీరోగా నటించబోయే చిత్రంలో హీరోయిన్ గా తాప్సీ అవకాశం దక్కించుకుంది. నీరజ్ పాండే దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్ర షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. ప్రస్తుతం ఈ అమ్మడు "షాదీ డాట్ కామ్" అనే చిత్రంలో నటిస్తుంది.