చెల్లికి ఫ్రెండ్... తాప్సీకి బాయ్‌ఫ్రెండ్!
on Sep 11, 2019
సొట్టబుగ్గల సుందరి తాప్సీ ప్రేమలో ఉన్నట్టు ఒప్పుకుంది. అయితే... అందరూ అనుకుంటున్నట్టు తన బాయ్‌ఫ్రెండ్ యాక్టరో, క్రికెటరో కాదని చెప్పింది. అతణ్ణి ఇంకా పెళ్లి చేసుకోలేదనీ, పిల్లలు కావాలనిపించినప్పుడు పెళ్లి చేసుకుంటాననీ ఆమె తెలిపింది. ఒకవేళ ఇదే స్టేట్మెంట్ ఎవరైనా హీరో ఇచ్చి ఉంటే పెద్ద గొడవ అయ్యేది. పిల్లలు కావాలనిపిస్తేనే పెళ్లి చేసుకుంటారా? అప్పటివరకూ మహిళలకు విలువ ఇవ్వరా? అవసరాల కోసం వాడుకుని వదిలేస్తారా? అని కొందరు స్త్రీవాదులు విరుచుకుపడేవారు. కానీ, ఆ స్టేట్మెంట్ ఇచ్చింది ఒక మహిళ కాబట్టి ఎవరూ విమర్శలు చేసే సాహసం చేయరు. ఈ సంగతి పక్కన పెడితే... తాప్సీ ప్రియుడు మన చుట్టుపక్కల లేడట. విదేశాల్లో ఉన్నట్టున్నాడు. యాక్చువల్లీ... తాప్సీకి అతడు బాయ్‌ఫ్రెండ్ కావడానికి ముందు, ఆమె చెల్లికి ఫ్రెండ్ అట! చెల్లెలు షగున్ పన్ను ద్వారా తాప్సీకి అతడు పరిచయం అయ్యాడు. తర్వాత అతడు తాప్సీకి నచ్చడంతో ప్రేమలో పడింది. ఆమెకు బాయ్‌ఫ్రెండ్ అయ్యాడు. రీసెంట్‌గా ఒక ఇంటర్వ్యూలో పన్ను సిస్టర్స్ ఈ సంగతులు చెప్పారు.