ట్రైలర్ రివ్యూ: ఆనందో బ్రహ్మ
on Jul 20, 2017
ఇది వరకటి రోజుల్లో హార్రర్ సినిమాలంటే ప్రేక్షకులను భయపెట్టడానికే ఉండేవి..కానీ ఇప్పుడు వారిని భయపెడుతూ నవ్వించేలా మన దర్శక నిర్మాతలు కథలను ఎంచుకుంటున్నారు. ఆ జోనర్‌లో రాబోతోంది "ఆనందో బ్రహ్మ". తాప్సీ, శ్రీనివాస్ రెడ్డి, వెన్నెల కిశోర్ కీలక పాత్రలు పోషించిన ఈ మూవీ ట్రైలర్ తాజాగా రిలీజైంది. తాతా..తాతా..నిద్ర రావట్లేదు ఒక కథ చెప్పవా అంటూ ఒక చిన్న పిల్ల మాటలతో మొదలయ్యే ఈ ట్రైలర్‌లో మొదట్లో భయపెట్టగా..ఆ తర్వాత కామెడీ సన్నివేశాలతో నవ్వించింది. చూస్తుంటే భయపెడుతూ నవ్వించడం దర్శకుడి ఆలోచనగా కనిపిస్తోంది.. హీరోయిన్ తాప్సీ ఇదివరకటిలా అందంగా లేదు.. మహి.వీ. రాఘవ దర్శకత్వం వహించిన ఈ మూవీకి విజయ్ చిల్లా, శశిదేవిరెడ్డి నిర్మాతలుగా వ్యవహరించారు. అతి త్వరలో మనకి ఆనందాన్ని పంచేందుకు ఆనందో బ్రహ్మ థియేటర్లలోకి రానుంది.
Also Read