ఒక్క చెంపదెబ్చే కానీ... అతను కొట్టకూడదు
on Jan 31, 2020
‘నీ భర్తకు ఎఫైర్ ఉందా?’
నో!
‘నీకు ఎఫైర్ ఉందా?’
నో!
‘భర్త కుటుంబంతో సమస్యలా?’
నో!
‘సో... జస్ట్ ఒక్క చెంపదెబ్బ కొట్టేందుకేనా??’
ఆశ్చర్యం, అమాయకత్వంతో కూడిన మహిళా న్యాయవాది చూపు!!
‘జస్ట్... ఒక్క చెంపదెబ్బే. కానీ... అతడు నన్ను కొట్టకూడదు’
బాధతో తాప్సీ సమాధానం!!
హిందీ సినిమా ‘తప్పడ్’ (తెలుగులో ‘చెంపదెబ్బ’ అని అర్థం)లో ఓ దృశ్యమిది!!! తాప్సీ పన్ను, పావేల్ గులాటీ భార్యాభర్తలుగా నటించిన ఈ సినిమా ట్రైలర్ శుక్రవారం విడుదలైంది. తనను అందరిలోనూ చెంపదెబ్బ కొట్టాడని భర్తతో విడిపోవాలనుకుంటున్న ఓ భార్య కథే ఈ సినిమా అని ట్రైలర్ ద్వారా తెలుస్తోంది. అప్పటివరకూ ‘భర్తతో సంతోషంగా ఉన్న నువ్వు ఒక్క చెంపదెబ్బకు ఎందుకు విడిపోవాలనుకుంటున్నావ్?’ అని ట్రైలర్‌లో తాప్సీని ఒకరు ప్రశ్నిస్తారు. ఈ సినిమాతో చెంపదెబ్బపై పెద్ద చర్చే జరుగుతోంది. ‘ముల్క్’, ‘ఆర్టికల్ 15’ చిత్రాల దర్శకుడు అనుభవ్ సుశీల్ సిన్హా తెరకెక్కించిన తాజా చిత్రమిది.