ఆనందో బ్రహ్మ ఫస్టాఫ్ రివ్యూ
on Aug 18, 2017
యాక్షన్, ఫ్యాక్షన్, లవ్, కామెడీ సినిమాలు తెలుగు తెరను దున్నేస్తున్న టైంలో హార్రర్ కామెడీతో ప్రేక్షకులను పలకరించేందుకు వచ్చింది ఆనందో బ్రహ్మ. కమెడియన్‌గా నటిస్తూనే ఇటీవల హీరోగా మంచి విజయాలను అందుకుంటున్న శ్రీనివాస్ రెడ్డి..అప్పుడెప్పుడో టాలీవుడ్‌కి టాటా చెప్పి..దర్శకేంద్రుడిపై సంచలన వ్యాఖ్యలు చేసిన తాప్సీ పొన్ను ఈ సినిమాలో లీడ్ రోల్స్ చేశారు. తొలి ట్రైలర్ నుంచే మంచి టాక్ తెచ్చుకోవడంతో పాటు ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ప్రభాస్ గెస్ట్‌గా హాజరుకావడంతో ఆనందో బ్రహ్మ మూవీకి మంచి బజ్ వచ్చింది.
ఇవాళ ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే కొన్ని ప్రాంతాల్లో ప్రీమియర్ షోలు ప్రదర్శించబడటంతో టాక్ బయటకు వచ్చింది. శ్రీనివాస్ రెడ్డి, వెన్నెల కిశోర్, తాగుబోతు రమేశ్, షకలక శంకర్ నవ్వుల పూవ్వులు పూయించారట. ముఖ్యంగా సౌండ్ ఎఫెక్ట్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగా భయపెట్టిందట. ఫస్టాఫ్ మొత్తం కామెడీతో నిండిపోగా..సెకండాఫ్‌లో కథనం కాస్త స్లోగా నడిచిందట..లీడ్ రోల్‌లో నటించిన తాప్సీ చుట్టూనే కథ నడుస్తుందట..దీనికి తాప్సీ పొన్ను నూరు పాళ్లు న్యాయం చేసిందని జనాలు అనుకుంటున్నారు. మరి ఈ సినిమా శ్రీనివాస్ రెడ్డికి, తాప్సీకి ఆనందాన్ని ఇచ్చిందో లేదో తెలియాలంటే ఫుల్ రివ్యూ వచ్చే దాకా వెయిట్ చేయాల్సిందే. పూర్తి సినిమా రివ్యూ కోసం తెలుగువన్‌ను ఫాలో అవుతూ ఉండండి.