ఆయన వస్తే నేను సిద్ధమే !
on Apr 14, 2014
తమిళ హీరో సూర్య ఎవరంటూ బాలీవుడ్ హీరోయిన్ కరీనా కపూర్ కామెంట్ చేసిందనే విషయంపై గతకొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్న విషయం అందరికి తెలిసిందే. ఈ విషయంపై సూర్య అభిమానులు కరీనాపై ఆగ్రహాన్ని వ్యక్తం చేసారు. అయితే ఈ విషయంపై ఈ అమ్మడు స్పందిస్తూ..."అసలు సూర్య తెలియదు అని నేను ఎప్పుడు అనలేదు. తమిళంలో సూర్య నటించిన చిత్రాలు హిందీలో డబ్ అవుతున్నాయి. అలంటి సూర్య తెలియకపోవడం ఏంటి? నిజానికి సూర్య చేస్తున్న "అంజాన్" సినిమా కోసం నన్ను ఎవరు సంప్రదించలేరు. అందులో నేను ఎలాంటి సాంగ్ చెయ్యట్లేదు. అవన్నీ పుకార్లు మాత్రమే. ఒకవేళ సూర్య హిందీలో ఏదైనా సినిమా చేస్తే అతనికి జోడిగా చేయడానికి నేను సిద్ధమే" అని చెప్పుకొచ్చింది. అంటే సూర్య దగ్గరకు ఈమె వెళ్ళకుండా.. సూర్యనే తన దగ్గరకు రమ్మంటుందని అర్థం చేసుకోవాలా? ఏమో... మరి ఈ విషయాన్నీ అభిమానులు ఎలా అర్థం చేసుకుంటారో చూడాలి.