చప్పట్ల కోసం రేయ్ ఎదురుచూపులు
on Apr 14, 2014
సాయిధరమ్ తేజ హీరోగా నటిస్తున్న మొదటి చిత్రం "రేయ్" రెండవ ట్రైలర్ ఇటీవలే విడుదల చేసారు. ఈ కార్యక్రమం హైదరాబాదులో జరిగింది. ఈ కార్యక్రమానికి రామ్ ముఖ్య అతిధిగా విచ్చేసారు. చిత్ర దర్శకుడు వైవియస్ చౌదరి మాట్లాడుతూ... "సినిమా విజయం తర్వాత కొట్టే చప్పట్ల కన్నా.. ముందు కొట్టే చప్పట్లకు విలువ ఎక్కువ. నాకు ఈ సినిమా ద్వారా అవి లభించాయి. ఈ చిత్రాన్ని వచ్చే నెల 9న విడుదల చేయబోతున్నాం. ఆరోజు ప్రేక్షకులు కొట్టే చప్పట్ల కోసం ఎదురు చూస్తున్నాం" అని అన్నారు. చక్రి అందించిన పాటలు ఇటీవలే విడుదలయ్యాయి. మంచి స్పందన వస్తుంది. సయామీ ఖేర్, శ్రద్ధాదాస్ లు కథానాయికలు.