Renu desai: రేణూ దేశాయ్ వెనకడుగు వేస్తుందా! అమ్మ, నాన్న, భర్త, అన్న ఏం చేస్తున్నారు
on Jan 20, 2026

-రేణూ దేశాయ్ సంచలన పోస్ట్
-అసలు తన ఉద్దేశ్యం ఏంటి
- వెనకడుగు వేస్తుందా!
పవన్ కళ్యాణ్(Pawan kalyan) మాజీ వైఫ్ 'రేణూ దేశాయ్'(Renu Desai)నిన్న మీడియాతో మాట్లాడుతు పది వీధి కుక్కలు క్రూరంగా ప్రవర్తిస్తున్నాయని, వందలాది వీధి కుక్కల్ని చంపుతున్నారు. మరి కొంత మంది మనుషులు క్రూరమైన మనస్తత్వంతో ప్రవర్తిస్తు సాటి మనుషుల మరణాలకి కారణం అవుతున్నారు. అందుకని మిగతా మనుషులందరినీ చంపటం లేదు కదా అని తను ఎవరికైతే ప్రశ్నలు సంధించాలని అనుకుందో వాళ్ళని క్లియర్ గా ప్రశ్నించడం జరిగింది. రీసెంట్ గా రేణు దేశాయ్ ఎక్స్ వేదికగా వారణాసి(Varanasi)లోని కాశీ విశ్వేశ్వరుడి పాదాల చెంత ఉన్న గంగా నదిలో బోట్ లో వెళ్తున్న పిక్ ని షేర్ చేసి ఒక పోస్ట్ చేసింది.
సదరు పోస్ట్ లో 'వీధికుక్కలని చంపడంపై నేను మాట్లాడిన మాటలని కొంత మంది విమర్శిస్తున్నారు. ఎన్ని విమర్శలు వచ్చినా . వీధికుక్కలని చంపాలనే నిర్ణయం సరైంది కాదని అర్ధమయ్యే వరకు పోరాడుతూనే ఉంటాను. ఆ పోరాటంలో వెనకడుగు అనేది లేదు. విమర్శలపై కూడా స్పందించను.నన్ను కాపాడటానికి అమ్మ, నాన్న, భర్త, అన్నయ్య ఎవరు లేరు. నేను నమ్మే భగవంతుడు దగ్గర మాత్రమే నా బాధ చెప్తాను.
Also read: హైకోర్ట్ కీలక నిర్ణయం.. రాజాసాబ్ లాంటి సినిమాలకి అన్యాయం జరగకూడదు
ఆయన నా ప్రార్థనలు వింటాడన్న నమ్మకం ఉంది.నేను తరచూ కాశీ కి ఎందుకు వెళ్తానో ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది. నేనెప్పుడు నా వ్యక్తిగత హక్కుల కోసం పోరాటం చేయలేదు. పొలిటికల్ ఎంట్రీ ఇస్తాననే వార్తలు వస్తున్నాయి. నాకు అటువంటి ఉద్దేశ్యం లేదని రేణూ దేశాయ్ ఎక్స్ వేదికగా రాసుకొచ్చింది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



