ENGLISH | TELUGU  

spirit: స్పిరిట్ నుంచి తప్పుకోవడంపై ప్రకాష్ రాజ్ ట్వీట్..  అనుకున్నదే నిజమయ్యింది

on Feb 10, 2026

 


-స్పిరిట్ లో తప్పుకున్నాడని కొన్ని రోజులుగా న్యూస్ 
-తన ట్వీట్ తో అసలు విషయం చెప్పేసిన ప్రకాష్ రాజ్
-ఫ్యాన్స్, మూవీ లవర్స్ ఏమంటారు 

 

యాక్టింగ్ పరంగా సౌత్ సినీ పరిశ్రమలో తిరుగులేని ఆధిపత్యాన్ని చెలాయించే నటుల్లో ప్రకాష్ రాజ్(Prakash Raj)ఒకరు. 'ఓజి' లో సత్యదాదా క్యారక్టర్  ద్వారా ఆ విషయాన్ని మరోసారి గుర్తు చేసాడు. దీంతో ప్రభాస్(Prabhas),సందీప్ రెడ్డి(Sandeep Reddy Vanga)అప్ కమింగ్ మూవీ స్పిరిట్(Spirit)లో ప్రకాష్ రాజ్ క్యారక్టరైజేషన్ ఎలా ఉండబోతోందనే ఆసక్తి అభిమానులతో పాటుప్రేక్షకుల్లో ఏర్పడింది. ఇందుకు కారణం కూడా లేకపోలేదు.సెల్యులాయిడ్ పై సరికొత్త క్యారెక్టర్స్ ని క్రియేట్ చేసే సందీప్ రెడ్డి వంగ తో ప్రకాష్ రాజ్ ఫస్ట్ టైం చేస్తుండటమే. కానీ కొన్ని రొజుల నుంచి సోషల్ మీడియా వేదికగా స్పిరిట్ నుంచి ప్రకాష్ రాజ్ తప్పుకున్నాడని,ప్రభాస్, ప్రకాష్‌రాజ్ మధ్య వచ్చే సన్నివేశాలని సందీప్ రెడ్డి తెరకెక్కించే తీరు ప్రకాష్ రాజ్ కి నచ్చటం లేదు. దీంతో  గుడ్ బై చెప్పి వెళ్లిపోయాడనే న్యూస్ పట్టా పగ్గాల్లేకుండా సోషల్ మీడియా మార్కెట్ లో స్వతంత్ర హోదాలో తిరుగుతుంది.కానీ ప్రకాష్ రాజ్ తన ట్వీట్ తో సదరు హోదా డమ్మీ  అంటు కళ్లెం వేసాడు.మరి ట్వీట్ లో ఏముందో చూద్దాం.


సినిమా స్ఫూర్తిపై విషపూరితమైన, నకిలీ వార్తలని ప్రచారం చేసే వారందరికీ చెప్తున్నాను. స్పిరిట్ లో నా సన్నివేశాల చిత్రీకరణ ప్రారంభించలేదు. వాట్స్ అప్ ఫ్యాక్టరీలు కథలని  ఊహిస్తారు. ఆ పని ఆపేసిపెద్దవారై జీవితాన్ని గడపండి అని తన స్టైల్లో ట్వీట్ చేసాడు. ఇప్పుడు ఈ ట్వీట్ రూమర్స్ ని సృషించే వాళ్ళకి కడుపుమంటగా మారింది. అభిమానులు. మూవీ లవర్స్ కి మాత్రం మహదానందంగా ఉండటంతో పాటు స్పిరిట్ ద్వారా మీ నట విశ్వరూపాన్ని మరోసారి ప్రదర్శించి ఆనందింప చెయ్యాలని కామెంట్స్ చేస్తున్నారు. 


Also read:  ప్రేమ అనేది శాపం.. అందుకేనా ఆ విధంగా చేస్తుంది

 

ఇప్పటికే రిలీజైన ‘స్పిరిట్’వాయిస్ టీజర్‌లో జైలు అధికారిగా ప్రకాష్‌రాజ్ చేస్తున్నాడనే విషయం తెలిసిందే. దీంతో ప్రకాష్ రాజ్ క్యారక్టర్ పై ఒక రేంజ్ లోనే అంచనాలు ఏర్పడ్డాయి. అంచనాలకి మించి అలరించేలా చేసే ట్రాక్ రికార్డు ప్రకాష్ రాజ్ సొంతం.

 

 


 

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.