మెగాస్టార్ ఫిట్‌నెస్ సీక్రెట్ ఇదే
on May 20, 2020
మెగాస్టార్ చిరంజీవి వయసు అరవైయేళ్లు దాటింది. ఇప్పుడు ఆయనకు 64 సంవత్సరాలు. అయినప్పటికీ ఫిట్‌గా ఉన్నారు. రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత లావు అయిన మెగాస్టార్, మళ్లీ సినిమాల్లోకి వచ్చిన తర్వాత స్లిమ్‌గా మారారు. లాక్‌డౌన్‌లో ఫిట్‌నెస్ మీద మరింత దృష్టి సారించానని చెప్పారు. తాజాగా తన ఫిట్‌నెస్ సీక్రెట్ ఏంటనేది ఆయన వెల్లడించారు. మెగాస్టార్ మాటల్లో వర్కవుట్స్ గురించి...
‣ నలభై నిమిషాలకు పైగా ప్రతి రోజూ వ్యాయామం చేస్తాను.
‣ రోజుకి రెండుసార్లు ఈత కొడతాను.
‣ ఖాళీ సమయాల్లో కిచెన్‌లోకి వెళ్లి వంట చేస్తున్నా. స్ట్రెస్ రిలీఫ్ గా ఉంటుంది.
‣ గార్డెన్‌లో మొక్కలకు నీళ్లు పట్టడం వంటివి చేస్తున్నా.
ఆడుతూ పాడుతూ అలా వ్యాయామంతో పాటు పనులు చేయడం వల్ల మెగాస్టార్ ఫిట్‌గా ఉన్నారన్నమాట.