పరుపు పంచుకోవడం వ్యక్తిగతమట!
on Nov 6, 2017
ఆండ్రియాకు కోపం వచ్చిందండోయ్! మీడియాపై రుసరుసలాడిపోతున్నారు అమ్మాయిగారు. అదేమంటే.. మీడియాపై కూడా లైంగిక వేధింపుల కేసు పెట్టాలని ఘాటు రిప్లై ఇచ్చేశారు ఆండ్రియా? మేం ఏం చేశాం? అని భయంగా మీడియావాళ్లు అడిగితే ఈ అమ్మాయిగారు చెప్పిన సమాధానం ఏంటో తెలుసా?
పరుపు పంచుకోవడం అనేది అమ్మాయిల వ్యక్తిగత విషయమట. ఇలాంటి వ్యవహారాలను ప్రశ్నించకూడదట. ప్రశ్నించడం కూడా లైంగిక వేధింపుల లిస్ట్ లోకే వెళ్తుందట. భలే చెప్పింది కదా! ఏది ఏమైనా మన ఆండ్రియా బహు ధైర్యశాలి సుమీ.
ఈ అమ్మాయిని ఫాలో అయితే.. ఇండియా అమెరికాను అధిగమించడం ఎంతో సేపు పట్టదు. ఇక తన గురించి మాట్లాడుతూ.. తనకు ఇండస్ట్రీలో లైంగిక వేధింపులే ఎదురవ్వలేదుట. ఇంత విన్నాక.. తనకు లైంగిక వేధింపులు ఎదురవుతాయని ఎవరనుకుంటారు చెప్మా?
ఒకవేళ అలా జరిగితే.. సినిమాలను కూడా వదులుకుంటుందట. అందుకే.. ఇప్పటికి ఒక్క సినిమా కూడా వదల్లేదు.
పైగా ఈవిడిగారు.. ఉదహారణలు కూడా ఇస్తున్నారండోయ్.. బయట ప్రపంచాన్ని ఒక్కసారి చూడమంటున్నారు. అమ్మాయిలందరూ.. ఇలాగే ఉంటున్నారట. మూతి ముద్దులు ఈ రోజుల్లో కామనట. విరామం లేకుండా ట్యూషన్ చెప్పేస్తున్నారు ఆండ్రియా. ఏది ఏమైనా.. ఆండ్రియా సూపర్ కదా!