తమ్ముళ్ల కోసం చిరంజీవి ఏం చేస్తారంటే?
on May 20, 2020
ఐదేళ్ల వయసులో వంట చేయడం మొదలుపెట్టానని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. అప్పట్లో వంటగదిలో తల్లికి సాయం చేసేవాడినని ఆయన తెలిపారు. తల్లి దగ్గర రెసిపీలు నేర్చుకున్నానని చెప్పారు. లాక్‌డౌన్‌లో మెగాస్టార్ వంటలు ఇరగదీస్తున్నారు. 'బీ ది రియల్ మెన్' ఛాలెంజ్‌లో భాగంగా తల్లికి ఉప్మా పెసరట్టు వేసి పెట్టిన ఆయన, మొన్నీమధ్య శ్రీమతి సురేఖతో కలిసి వంటగదిలో గరిటె తిప్పారు. పాకశాస్త్రంలో తాను ఇంత ప్రావీణ్యం సాధించానంటే ఆ క్రెడిట్ అంతా తన తల్లి అంజనాదేవిదే అని చిరంజీవి అన్నారు.
"ఇంతకు ముందు అప్పుడప్పుడూ నేను వంట చేసేవాడిని. అయితే యాక్టింగ్ & పొలిటికల్ కమిట్మెంట్స్ వల్ల చేయడం కుదరలేదు. మళ్లీ ఈ లాక్‌డౌన్‌లో నాలోని షెఫ్ ను బయటకు తీశాను. ఉప్మా, నూడుల్స్, ఫ్రైడ్ రైస్, దోసెలు... నేను అన్నీ చేస్తా" అని చిరంజీవి అన్నారు. లాక్ డౌన్ ముగిసిన తర్వాత తమ్ముళ్లు నాగబాబు, పవన్ కల్యాణ్ కోసం వండిపెడతానని ఆయన తెలిపారు. మెగాస్టార్ ఫ్యామిలీ మెంబెర్స్ అందరూ ఆదివారం ఆదివారం కలిసి భోజనాలు చేస్తుంటారు. రెండు నెలలుగా ఈ ఆనవాయితీకి బ్రేక్ పడింది.
Megastar Chiranjeevi Cooking,chiranjeevi brothers,chiranjeevi cooking,Megastar Chiranjeevi Cooking Dosa For His,Megastar Chiranjeevi Cooks Dosa For His Mother