Akhanda 2: అఖండ 2 నుంచి సాంగ్ రిలీజ్ చేసిన మేకర్స్
on Dec 15, 2025
.webp)
-సాంగ్ కి మంచి స్పందన
-థియేటర్స్ అన్ని దేవాలయాలు
- బాలయ్య తాండవం ఇప్పట్లో తగ్గదు
గాడ్ ఆఫ్ మాసెస్ 'బాలకృష్ణ'(Balakrishna)వరల్డ్ వైడ్ గా ఉన్న థియేటర్స్ లో 'అఖండ 2'(Akhanda 2)తో తన ఏక ఛత్రాధిపత్యాన్ని కొనసాగిస్తున్నాడు. అఖండ అనే నామధేయంతో అఘోర గా బాలయ్య కనపరుస్తున్న పెర్ ఫార్మెన్స్ కి అభిమానులు, ప్రేక్షకులు ఎంతో ముగ్దులవుతున్నారు. దీంతో వయసుతో తారతమ్యం లేకుండా థియేటర్ లోని అభిమానులు ప్రేక్షకులు తమకి తెలియకుండానే శివ తాండవం చేస్తున్నారు. అంతలా బాలయ్య నట సమ్మోహన శక్తీ, థమన్ ఇచ్చిన సాంగ్స్ ,ఆర్ ఆర్ నిలుస్తున్నాయి.
ఆ తాండవాన్ని మరింత పెంచేలా 'గంగాధర శంకర'(Gangadhara Shankara)అనే సాంగ్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. సుమారు మూడు నిమిషాల నలబై సెకన్ల నిడివి ఉన్న సదరు సాంగ్ కొంత సేపటి క్రితమే యూట్యూబ్ లో రిలీజయ్యింది. సాంగ్ లోని ప్రతి పదం భోళా శంకరుడి గొప్ప తనాన్ని చాటి చెప్తుండటంతో శివ భక్తులు ఎంతగానో తన్మయత్వం చెందుతున్నారు. అద్వీతీయ రాసిన ఈ సాంగ్ ని ఐశ్వర్య, శృతి రంజని, సౌందర్య ఆలపించారు. రెండు వారాల క్రితమే సాంగ్స్ అన్ని రిలీజ్ అయ్యాయి. కానీ ఇప్పుడు ఒక్కక్కొటి విడిగా చేస్తున్నారు. ఈ క్రమంలోనే గంగాధర సాంగ్ ని రిలీజ్ చేసారు.
Also read: అవతార్ 3 థియేటర్స్ కి వార్నింగ్.. లెటర్ తో సహా దొరికిపోయిన అగ్ర దర్శకుడు

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



