Home

»

Latest News

‘లెనిన్‌’ సెన్సేష‌న‌ల్ రికార్డు: రెండు రోజుల్లోనే 100 మిలియ‌న్ స్ట్రీమింగ్ మినిట్స్‌.!

Aug 11, 2026 1:16PM

అఖిల్ అక్కినేని హీరోగా ముర‌ళి కిషోర్ అబ్బూరు ద‌ర్శ‌క‌త్వంలో వచ్చిన రీసెంట్ బ్లాక్ బ‌స్ట‌ర్  ‘లెనిన్’. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో మనం ఎంటర్‌ప్రైజెస్, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగ వంశీ నిర్మించారు. థియేట‌ర్స్‌లో బ్లాక్ బ‌స్ట‌ర్ టాక్‌తో రూ.100 కోట్ల వ‌సూళ్ల‌ను సాధించిన ఈ చిత్రం ఆగ‌స్ట్ 7 నుంచి ప్ర‌ముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ జీ5లో స్ట్రీమింగ్ అవుతోన్న సంగ‌తి తెలిసిందే.

లెనిన్ సినిమా థియేట‌ర్స్‌లోనే కాదు.. జీ5లో స్ట్రీమింగ్‌లోనూ స‌రికొత్త రికార్డ్స్‌ను క్రియేట్ చేస్తుండ‌టం విశేషం. రెండు రోజుల్లోనే లెనిన్ సినిమా 100 మిలియ‌న్స్ స్ట్రీమింగ్ మినిట్స్‌ను క్రాస్ చేసి అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది. ఇప్పుడు ఈ సినిమా ఎంతలా ప్రేక్ష‌కాద‌ర‌ణ పొందుతుంద‌నే దానికి ఇప్పుడు జీ5లో ద‌క్కుతున్న ఆద‌ర‌ణ ఓ సాక్ష్యంగా పేర్కొన‌వ‌చ్చు. ఇదే ఊపులో ఈ చిత్రం ఓటీటీలో మ‌రిన్ని సెన్సేష‌న్స్ క్రియేట్ చేస్తుంద‌ని అంద‌రూ భావిస్తున్నారు. 

రాయ‌ల‌సీమ‌లోని చిత్తూరు జిల్లాలోని రామ‌చంద్ర‌పురం గ్రామంలో జ‌రిగే ద్రౌప‌ద‌మ్మ తిరునాళ్లు నేప‌థ్యంలో లెనిన్ సినిమాను తెర‌కెక్కించారు ద‌ర్శ‌కుడు. కోపం, ద్వేషం, ప‌గ‌, ప్ర‌తీకారాల‌తో ర‌గిలిపోయే ఓ స్నేహితుడు త‌న ప్రాణ స్నేహితుడైన లెనిన్‌కు చేసే ద్రోహం ఎలాంటిది?  దాని వ‌ల్ల లెనిన్ ఏం కోల్పోయాడు? అస‌లు లెనిన్ జైలుకు ఎందుకెళ్లాడు?  రామ‌చంద్ర‌పురంలో జ‌రిగిన కురుక్షేత్రంలో ఎవ‌రు విజ‌యం సాధించారు? అనే విష‌యాలు తెలియాలంటే జీ5లో స్ట్రీమింగ్ అవుతోన్న లెనిన్ సినిమా చూడాల్సిందే. 

రా అండ్ ర‌స్టిక్ పాత్ర‌లో అఖిల్ పెర్ఫామెన్స్‌కు సూప‌ర్బ్ రెస్పాన్స్ వ‌చ్చింది. భాగ్య‌శ్రీ బోర్సె గ్లామ‌ర్‌తో పాటు న‌ట‌న‌తో మెప్పించింది. ముర‌ళి కిషోర్ అబ్బూరు క‌థ‌, క‌థ‌నం, టేకింగ్‌కు ప్ర‌శంస‌లు ద‌క్కాయి. ఇక ఈ సినిమాకు తమన్ సంగీతం ప్రధాన ఆకర్షణ అని చెప్పుకోవచ్చు. 

 

 

Akhil Akkineni, Lenin Movie, OTT Telugu, Nagarjuna

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com