Updated : Dec 14, 2024
దర్శక ధీరుడు రాజమౌళి(rajamouli)ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు(mahesh babu)తో తెరకెక్కించబోయే సినిమాకి సంబంధించిన పనుల్లో బిజీగా ఉన్నాడు.ప్రెజెంట్ ప్రీప్రొడక్షన్ లో ఉన్న ఈ మూవీ నెక్స్ట్ ఇయర్ బిగినింగ్ లోనే ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.రాజమౌళి ఇప్పటికే కొన్ని లొకేషన్స్ ని కూడా ఫైనల్ చేసాడు. విజయేంద్రప్రసాద్ కథ ని అందిస్తున్న ఈ మూవీపై మహేష్ ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకుల్లో కూడా భారీ అంచనాలు ఉన్నాయి.
ఇక రాజమౌళి లేటెస్ట్ గా అమెజాన్ ప్రైమ్ వేదికగా టెలికాస్ట్ అవుతున్న రానా టాక్ షో(rana talk show)లో పాల్గొన్నాడు.అందులో ఆయన మాట్లాడుతు నేను ఇంటర్ మీడియట్ చదివేటపుడు మా క్లాస్ లో భారతి అనే అమ్మాయి ఉండేది.ఆ అమ్మాయి అంటే నాకు చాలా ఇష్టం.ఈ విషయం మా క్లాస్ లో ఉన్న వాళ్లందరికీ తెలియడంతో నన్ను ఈ విషయంపై ఏడిపించేవాళ్ళు.నాకేమో ఆ అమ్మాయితో మాట్లాడాలంటే చాలా భయం.చివరకి అతి కష్టం మీద సంవత్సరం మొత్తం మీద ఒకే ఒక్కసారి ఆ అమ్మాయితో మాట్లాడాను.తను నా ముందు బెంచి లో కూర్చుంటూ ఉంటుంది.భారతి అని పిలవగానే ఎప్పటినుంచో నా పిలుపు కోసం ఎదురుచూస్తున్నట్టుగా వెనక్కి తిరిగి చూసింది.ట్యూషన్ ఫీజ్ కట్టావా అని అడిగే సరికి ఇందుకా పిలిచింది అన్నట్టు నిరాశగా చూసి కట్టానని చెప్పి తల ఊపుతు చెప్పింది.కానీ నేను పిలిచినప్పుడు మొదటి సారి ఆమె వెనక్కి తిరిగి చూసిన తీరు ఇప్పటికి మర్చిపోలేను.
నాని, సమంత తో తెరకెక్కించిన 'ఈగ' మూవీలో ఇలాంటి సన్నివేశాలనే తెరకెక్కించాను.చాలా మంది దర్శకులు నాలాగే తమ అనుభవాలని తెర మీదకి తీసుకొస్తారని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతానికి అయితే రాజమౌళి లవ్ మ్యాటర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది.