
-విజయ్, సంగీత కేసు పరిస్థితి ఏంటి
-మధ్యవర్తిత్వానికి తేరా లేపారా!
-అదంతా రూమరేనా!
ఇళయ దళపతి 'విజయ్'(Vijay)కి ఇటీవల భార్య సంగీత(sangeeta)విడాకుల నోటీసు పంపించిన సంగతి తెలిసిందే. ఆ ఇద్దరి మధ్య ఎప్పట్నుంచి ఇంటర్నల్ గా గొడవలు జరుగుతున్నాయో తెలియదు కానీ, సడెన్ గా సంగీత విడాకులు పంపించడంతో ఒక్కసారిగా ఫ్యాన్స్ తో పాటు యావత్ ఇండియన్ సినీ పరిశ్రమ షాక్ కి గురయ్యింది. దీంతో ఎవరు ఎంత బిజీలో ఉన్నా విజయ్, సంగీత ఎపిసోడ్ కి సంబంధించిన మరిన్ని కొత్త విషయాల కోసం సోషల్ మీడియాని అస్సలు వదలటం లేదు. ఈ నేపథ్యంలో న్యూ అప్ డేట్ ఒకటి ఆ అందరు మరింతగా చర్చించుకునే అవకాశాన్ని కల్పించింది. కాకపోతే ఆ అప్ డేట్ హోదా రూమర్. ఏంటో చూద్దాం.
సంగీత ఇష్యు మరింతగా పబ్లిక్ లోకి వెళ్లకుండా విజయ్ సామరస్యంగా ముగించాలని చూస్తున్నాడని, అందుకు గాను కోర్టు దాకా వెళ్లకుండా సంగీత, కుమారుడు జేసన్ సంజయ్, కూతురు సాషాల భవిష్యత్తుతో పాటు ఆర్ధిక నిలకడ కోసం 250 కోట్ల రూపాయలని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడని, ఇందు కోసం విజయ్ కొంత మంది పెద్దలని రంగంలోకి దింపాడనే వార్తలు తమిళ సినీ మార్కెట్ తో పాటు రాజకీయ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి. ముందుగానే చెప్పుకున్నట్టు రూమర్ హోదాలోనే.
aslo read: Peddi: రామ్ చరణ్ రుద్రతాండవం.. రై రై పుట్టుకకి కారణం చెప్పిన అనంత్ శ్రీరామ్
ఏది ఏమైనా విజయ్ కి ఈ ఇయర్ ప్రారంభమే షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి. పొంగల్ కి రిలీజ్ కావాల్సిన 'జన నాయగన్'(Jana Nayagan)సెన్సార్ ఎంట్రీ వల్ల ల్యాబ్ లోనే ఉంది. రిలీజ్ విషయం కూడా చెప్పలేని పరిస్థితి. మళ్ళీ నెల రోజులకే సంగీత నుంచి విడాకుల నోటీసు. ఈ నేపథ్యంలో మే లేదా జూన్ లో జరిగే ఎన్నికల్లో విజయ్ తన కొత్త పొలిటికల్ పార్టీ తమిళగ వెట్రి కజగం ద్వారా ఎలాంటి ఫలితాలని చవి చూడబోతున్నాడనే ఆసక్తి ఏర్పడింది.






