
టాలీవుడ్‌లో కొన్ని కాంబినేషన్లకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది. అలాంటి వాటిలో దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థ మధ్య ఉన్న అనుబంధం కూడా ఒకటి. ‘జులాయి’ నుంచి మొదలైన ఈ ప్రయాణం ఎన్నో ఏళ్లుగా కొనసాగుతోంది. అయితే ఇప్పుడు ఈ బంధానికి బ్రేక్ పడబోతోందా? త్రివిక్రమ్ ఆ బ్యానర్ నుంచి బయటకు వచ్చి ఇతర నిర్మాతలతో సినిమాలు చేయాలని నిర్ణయించుకున్నారా? అంటే ఇండస్ట్రీలో అవుననే ప్రచారం జోరుగా వినిపిస్తోంది.
త్రివిక్రమ్, హారిక హాసిని బ్యానర్ ది 14 ఏళ్ళ బంధం. మొదటిసారి 2012లో వచ్చిన ‘జులాయి’ కోసం వీరు చేతులు కలిపారు. ఆ తర్వాత ‘అత్తారింటికి దారేది’ బయట బ్యానర్ లో చేసిన త్రివిక్రమ్.. ‘సన్నాఫ్ సత్యమూర్తి’ నుంచి ప్రతి సినిమా హారిక హాసినితోనే చేస్తున్నారు. హారిక హాసిని బ్యానర్ కూడా త్రివిక్రమ్ తో తప్ప వేరే దర్శకుడితో సినిమా చేయడంలేదు.
వీరి కాంబోలో ఇప్పటివరకు ‘జులాయి’, ‘సన్నాఫ్ సత్యమూర్తి’, ‘అ ఆ’ ‘అజ్ఞాతవాసి’, ‘అరవింద సమేత’, ‘అల వైకుంఠపురములో’, ‘గుంటూరు కారం’, ‘ఆదర్శ కుటుంబం’ ఇలా మొత్తం 8 సినిమాలు వచ్చాయి. నెక్స్ట్ ఎన్టీఆర్ తో భారీ మైథలాజికల్ ప్రాజెక్ట్ చేయడానికి రెడీ అవుతున్నారు. ఇలాంటి సమయంలో ఈ వార్తలు షాకింగ్ గా మారాయి.

ఇటీవల కొన్ని అంతర్గత సమస్యలు తలెత్తినట్లు వార్తలు వస్తున్నాయి. నిర్మాత ఎస్. రాధాకృష్ణ (చినబాబు), త్రివిక్రమ్ మధ్య కొన్ని విషయాల్లో విభేదాలు వచ్చినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ‘ఆదర్శ కుటుంబం’ సినిమా విడుదల వాయిదాలు, ఆర్థిక అంశాల చుట్టూ అసంతృప్తి ఏర్పడిందనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే త్రివిక్రమ్ ఇకపై ఆ బ్యానర్‌తో ప్రత్యేక అనుబంధాన్ని కొనసాగించకూడదని భావిస్తున్నట్లు టాక్.
ఇది కూడా చదవండి: ‘ఆర్ఆర్ఆర్’ రికార్డు బద్దలు.. చరిత్ర సృష్టించిన ‘వారణాసి’.!
ప్రస్తుతం ఈ వార్తలతో ఎక్కువగా ప్రభావితమయ్యే ప్రాజెక్ట్ ఎన్టీఆర్ - త్రివిక్రమ్ సినిమా. ‘గాడ్ ఆఫ్ వార్’ అనే పేరుతో ప్రచారంలో ఉన్న ఈ పౌరాణిక చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించనున్నట్లు ప్రకటించారు.
అయితే ఈ సినిమా కోసం రూ.500 కోట్ల వరకు బడ్జెట్ అవసరమవుతుందనే అంచనాలు ఉన్నాయి. మరోవైపు ప్రస్తుతం ఓటీటీ మార్కెట్‌లో నెలకొన్న పరిస్థితులు, భారీ బడ్జెట్ సినిమాల రిస్క్ వంటి అంశాలు నిర్మాతలను ఆలోచనలో పడేస్తున్నట్లు గత కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు త్రివిక్రమ్, హారిక అండ్ హాసిని మధ్య విభేదాల ప్రచారం కూడా తోడవడంతో ఈ ప్రాజెక్ట్ భవిష్యత్తుపై ఆసక్తి పెరిగింది.

ఒకవేళ త్రివిక్రమ్ నిజంగానే హారిక అండ్ హాసిని క్రియేషన్స్ నుంచి బయటకు వస్తే.. ఆయన తదుపరి సినిమాలు ఏ బ్యానర్‌లో ఉంటాయన్నది ఆసక్తికరంగా మారుతుంది. ‘గాడ్ ఆఫ్ వార్’ను మరో నిర్మాణ సంస్థకు అప్పగిస్తారా? లేక ప్రాజెక్ట్ విషయంలోనే ఏదైనా కీలక మార్పు ఉంటుందా? అనే చర్చ మొదలైంది.
అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. త్రివిక్రమ్ ఈ బ్యానర్ నుంచి తప్పుకుంటున్నారనే వార్తకు ఇప్పటివరకు అధికారిక ధ్రువీకరణ లేదు.
మరి ఇన్నేళ్లుగా కొనసాగుతున్న త్రివిక్రమ్ - హారిక అండ్ హాసిని అనుబంధం నిజంగానే ముగియబోతోందా? లేక ఇవన్నీ పుకార్లుగా మిగిలిపోతాయా? ఒకవేళ నిజంగానే ఆ బంధానికి బ్రేక్ పడితే ‘గాడ్ ఆఫ్ వార్’ పరిస్థితి ఏంటి? ఈ ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే ఏదైనా అఫీషియల్ అప్డేట్ వచ్చేవరకు ఎదురుచూడాల్సిందే.
మీకు నచ్చవచ్చు:
బాలయ్య నన్ను ‘ఏరా పెద్దిరెడ్డి’ అని పిలుస్తారు.. ‘దాదా’ సినిమా ఎలా ఉండబోతుందంటే.?
‘వారణాసి’ స్టోరీ లీక్.. రావణుడి నవరత్నాల హారం చుట్టూ అసలు కథ.!
[Trivikram Haarika Hassine Partnership in Trouble, Trivikram Srinivas, Haarika & Hassine Creations, NTR Trivikram Movie, God Of War, Jr NTR, Trivikram, S Radha Krishna, Chinababu, Naga Vamsi]






