
స్టార్ హీరోయిన్ త్రిష కృష్ణన్(Trisha Krishnan ) ఇక సినిమాలకు గుడ్ బై చెప్పనున్నారా? రెండు దశాబ్దాల పాటు తన నటనతో, అందంతో కోట్లాది మంది అభిమానులను అలరించిన ఈ చెన్నై చంద్రం.. త్వరలోనే వెండితెరకు దూరం కానున్నారా? అంటే అవుననే అంటున్నాయి తమిళ రాజకీయ వర్గాలు.
కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ 'తమిళగ వెట్రి కళగం' (TVK) పార్టీని స్థాపించిన సంగతి తెలిసిందే. విజయ్, త్రిషల మధ్య మంచి స్నేహం ఉంది. వీరిద్దరూ కలిసి నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేశాయి. అయితే, ఇటీవల జరిగిన ఓ వేడుకలో త్రిష, విజయ్‌తో కలిసి కనిపించడంతో.. TVK పార్టీలో ఆమె చేరడం ఖాయమని సోషల్ మీడియాలో చర్చ మొదలైంది.

ప్రస్తుతం త్రిష, మెగాస్టార్ చిరంజీవి సరసన 'విశ్వంభర' సినిమాలో నటిస్తోంది. సూర్యతో 'కరుప్పు', మోహన్ లాల్ తో 'రామ్' సినిమాలు కూడా చేస్తోంది. అయితే, గత కొంతకాలంగా త్రిష కొత్త సినిమాలకు సంతకం చేయడం లేదని సమాచారం. తన వద్దకు వస్తున్న కథలను సున్నితంగా తిరస్కరిస్తూ, ప్రస్తుతం ఒప్పుకున్న సినిమాల షూటింగ్‌లను శరవేగంగా పూర్తి చేస్తోందట.
త్రిష త్వరలోనే సినిమాలకు గుడ్‌బై చెప్పి రాజకీయాల్లోకి రావడం కన్ఫర్మ్ అన్న వాదన బలంగా వినిపిస్తోంది. TVK పార్టీ ద్వారా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి, తమిళ రాజకీయాలలో కీలక పాత్ర పోషించాలని ఆమె భావిస్తోందట. వచ్చే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నాటికి పూర్తి స్థాయిలో రాజకీయాల్లో క్రియాశీలకంగా మారాలని త్రిష భావిస్తున్నట్లు సమాచారం.






