
తెలుగు నాట మరో కొత్త రాజకీయ పార్టీ పురుడు పోసుకోవడానికి సిద్దమయ్యింది. మాజీ ఎం పి, ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్ విజయసాయిరెడ్డి ఆ కొత్త రాజకీయ పార్టీ సారధి. దీంతో సోషల్ మీడియాలోనూ, రాజకీయ వర్గాల్లోనూ విజయసాయి రెడ్డి పెట్టబోయే కొత్త పార్టీలో సినీ రంగానికి చెందిన పలువురు నటులు చేరబోతున్నారనే వార్తలు నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి. సినీ రంగానికి చెందిన కొందరు ప్రముఖులు ఇప్పటికే ఆయనతో టచ్‌లో ఉన్నారని, పార్టీ ఆవిర్భావ వేదికపై వారందరూ కనిపిస్తారని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కథనాలు దర్శనమిస్తున్నాయి.
అయితే ఈ ప్రచారంలో ఎంతవరకు నిజముందనే అంశాన్ని పరిశీలిస్తే, ఇవన్నీ కేవలం నెట్టింట చక్కర్లు కొడుతున్న రూమర్లు మాత్రమేనని స్పష్టమవుతోంది. విజయసాయి రెడ్డి వైపు నుంచి కానీ, లేదా ఆయా సినీ నటుల వైపు నుంచి కానీ ఎలాంటి అధికారిక ధ్రువీకరణ వెలువడలేదు. గతంలో వైఎస్సార్‌సీపీలో ఉన్నప్పుడు కూడా సినీ రంగానికి చెందిన పలువురితో ఆయనకు మంచి సంబంధాలు ఉండటం, పైగా టాలీవుడ్ ప్రముఖులతో ఆయనకున్న పాత పరిచయాల కారణంగానే ఈ తరహా ప్రచారాలు పుట్టుకొచ్చాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కానీ ఒక్కటి మాత్రం నిజం ఏంటంటే రాజకీయం, సినిమా అనేవి ఒకే తల్లి కడుకున పుట్టిన ట్విన్స్.
Also Read: రామ్ పోతినేనికి విలన్‌గా మారిన ఆ స్టార్ హీరో!.
Telugu Cinema, Tollywood





