Home

»

Gossips

రామ్‌చరణ్ ఫ్యాన్స్‌కి షాక్‌.. సుకుమార్ మూవీ RC17 షూటింగ్ వాయిదా? కారణం ఇదే!

Jun 13, 2026 3:55PM

టాలీవుడ్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అభిమానులకు ఒకవైపు సంతోషం, మరోవైపు కాస్త ఆందోళన కలిగించే వార్త ఒకటి ఫిలిం నగర్ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది. రీసెంట్‌గా బ్లాక్‌బస్టర్ హిట్‌తో దూసుకుపోతున్న మెగా పవర్ స్టార్, ఇప్పుడు తన తదుపరి సినిమాల షూటింగ్స్‌కు భారీ విరామం ప్రకటించబోతున్నట్లు ఇండస్ట్రీలో గట్టిగా వినిపిస్తోంది.

తాజా సమాచారం ప్రకారం, దర్శకుడు బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో వచ్చిన రూరల్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం ఏకంగా రూ.345 కోట్లకు పైగా వసూళ్లు సాధించి చరణ్ కెరీర్‌లో మరో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. అయితే, ఈ సినిమా షూటింగ్ సమయంలో చరణ్ శారీరకంగా ఎంతో శ్రమించాల్సి వచ్చిందట.

ముఖ్యంగా ‘పెద్ది’ చిత్రంలోని భారీ యాక్షన్ సీక్వెన్స్ లు, హై-వోల్టేజ్ క్రీడా సన్నివేశాల చిత్రీకరణ సమయంలో మెగా పవర్ స్టార్‌కు కొన్ని చిన్నపాటి గాయాలైనట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆ పాత గాయాల నుంచి పూర్తిగా కోలుకోవడానికి చరణ్ ఒక చిన్న సర్జరీ చేయించుకోనున్నట్లు టాక్. సర్జరీ అనంతరం వైద్యుల సలహా మేరకు ఆయన కొన్ని నెలల పాటు కంప్లీట్ బెడ్ రెస్ట్ తీసుకోనున్నారట.

ఈ హెల్త్ బ్రేక్ కారణంగా, ‘రంగస్థలం’ లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత సుకుమార్ దర్శకత్వంలో రామ్‌చరణ్ చేయాల్సిన మోస్ట్ అవేటెడ్ క్రేజీ ప్రాజెక్ట్ (RC17) షూటింగ్ అనుకున్న సమయానికి ప్రారంభమయ్యేలా లేదు. ముందస్తు ప్లాన్ ప్రకారం ఈ ఏడాది చివర్లోనే సెట్స్ పైకి వెళ్లాల్సిన ఈ మూవీ, ఇప్పుడు ఏకంగా జనవరి 2027కు వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఒకవేళ ఇదే నిజమైతే, వచ్చే ఏడాది వెండితెరపై రామ్‌చరణ్ సందడి ఉండకపోవచ్చు. మళ్లీ చరణ్‌ను థియేటర్లలో చూడాలంటే అభిమానులు 2028 వరకు వేచి చూడాల్సిందే. ఈ వార్త మెగా ఫ్యాన్స్‌ను కాస్త అప్‌సెట్ చేస్తున్నప్పటికీ, తమ హీరో ఆరోగ్యమే తమకు ముఖ్యమంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ‘చిట్టిబాబు’ లాంటి ఐకానిక్ క్యారెక్టర్ ఇచ్చిన సుకుమార్, ఈసారి చరణ్‌ను ఎలా చూపిస్తారో అనే అంచనాలతో ఈ ప్రాజెక్ట్‌పై భారీ హైప్ క్రియేట్ అయింది. అయితే ఈ వాయిదా వార్తలపై అటు మెగా కాంపౌండ్ కానీ, ఇటు సుకుమార్ టీమ్ కానీ ఇంకా అధికారికంగా స్పందించాల్సి ఉంది.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com