మార్కో డైరెక్టర్ తో బాలయ్య.. మాస్ సంభవం!
on Feb 1, 2026

ఒక్కోసారి ఊహించని కాంబినేషన్స్ సెట్ అవుతుంటాయి. ఆ కాంబినేషన్ ఊహించుకుంటేనే ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ వస్తాయి. ఇప్పుడు అలాంటి కాంబోనే సెట్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna), 'మార్కో' దర్శకుడు హనీఫ్ అదెని(Haneef Adeni) చేతులు కలుపుతున్నట్లు న్యూస్ వినిపిస్తోంది.
బాలకృష్ణ ప్రస్తుతం తన 111వ సినిమాను గోపీచంద్ మలినేని దర్శకత్వంలో చేస్తున్నారు. ఆ తర్వాత పలు ప్రాజెక్ట్ లు లైన్ లో ఉన్నాయి. వాటిలో దిల్ రాజు బ్యానర్ లో చేయనున్న ప్రాజెక్ట్ కూడా ఉంది. అయితే ఈ సినిమా డైరెక్టర్ గా వంశీ పైడిపల్లి సహా పలువురు పేర్లు వినిపించాయి. ఇప్పుడు అనూహ్యంగా హనీఫ్ పేరు తెరపైకి వచ్చింది.
రూ.100 కోట్ల గ్రాస్ క్లబ్ లో చేరిన మలయాళ సినిమాలలో 'మార్కో' ఒకటి. ఉన్ని ముకుందన్ హీరోగా హనీఫ్ తెరకెక్కించిన ఈ యాక్షన్ థ్రిల్లర్.. మోస్ట్ వయలెంట్ ఇండియన్ ఫిలిమ్స్ లో ఒకటిగా పేరు పొందింది. అలాంటి వయలెంట్ డైరెక్టర్ తో దిల్ రాజు ప్రొడక్షన్స్ గతేడాది ఓ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేసి సర్ ప్రైజ్ చేసింది. కానీ హీరోను మాత్రం రివీల్ చేయలేదు. అయితే ఆ ప్రాజెక్ట్ లో నటించనున్న హీరో బాలకృష్ణనే అని ప్రచారం జరుగుతోంది.
బాలకృష్ణ యాక్షన్ సినిమాలకు పెట్టింది పేరు. ఆయన మాస్ ఇమేజ్ గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే. అలాంటి బాలకృష్ణను వయలెంట్ డైరెక్టర్ హనీఫ్ డైరెక్ట్ చేస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచనే ఆసక్తిని కలిగిస్తోంది. ఇక నిజంగానే ఈ కాంబో సెట్ అయితే థియేటర్లు షేక్ అవుతాయి అనడంలో డౌట్ లేదు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



