
అక్కినేని అభిమానులకు ఒక మైండ్ బ్లోయింగ్ అప్‌డేట్. యువసామ్రాట్ నాగ చైతన్య కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మకమైన 25వ సినిమా గురించి ఫిల్మ్ నగర్ వర్గాల్లో ఒక ఊహించని వార్త చక్కర్లు కొడుతోంది.
చైతన్య 25వ సినిమా గురించి ఎప్పటినుంచో వార్తలొస్తున్నాయి. 'బెదురులంక 2012' ఫేమ్ క్లాక్స్ దర్శకత్వంలో ఈ ప్రాజెక్ట్ ఉంటుందని న్యూస్ వినిపించింది. అయితే ఇప్పుడు లెక్కలు మారిపోయాయి. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ కోసం హ్యాట్రిక్ హిట్ల దర్శకుడు వెంకీ అట్లూరి రంగంలోకి దిగబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
వెంకీ అట్లూరి ప్రెజెంట్ టాలీవుడ్‌లో ఒక సాలిడ్ హిట్ ట్రాక్‌లో ఉన్నారు. 'సార్', 'లక్కీ భాస్కర్' వంటి వైవిధ్యమైన సినిమాలతో వరుసగా బాక్సాఫీస్ వద్ద విజయం సాధించారు. రీసెంట్ గా వచ్చిన 'విశ్వనాథ్ & సన్స్'తో మరో బ్లాక్ బస్టర్ ను ఖాతాలో వేస్తున్నారు. అయితే గత కొన్నాళ్లుగా ఆయన ఇతర భాషల హీరోలతో వరసగా సినిమాలు చేశారు. అందుకే ఇప్పుడు మళ్ళీ ఒక ప్రాపర్ తెలుగు హీరోతో, అందునా ఒక మైల్‌స్టోన్ సినిమా చేయాలనే ఆలోచనలో ఉన్నారట.
ఇక మరోవైపు సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత సూర్యదేవర నాగవంశీ కూడా నాగ చైతన్యతో ఒక బిగ్ ప్రాజెక్ట్ చేయాలని చాలా కాలంగా ప్లాన్ చేస్తున్నారు. ఇటీవల అక్కినేని అఖిల్ 'లెనిన్' సినిమా ప్రమోషన్స్ విషయంలో నాగవంశీ చూపించిన శ్రద్ధ అక్కినేని కాంపౌండ్‌కు చాలా బాగా నచ్చింది. పైగా వెంకీ అట్లూరి హోమ్ బ్యానర్ లాంటిది సితార ఎంటర్‌టైన్‌మెంట్స్. అందుకే ఈ ముగ్గురి కాంబినేషన్‌లో NC25 సెట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
మరి నాగ చైతన్య మైల్‌స్టోన్ సినిమా కోసం వెంకీ అట్లూరి ఎలాంటి కథ అనేది ఇప్పుడు అందరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తోంది.
అన్నీ అనుకున్నట్టు కుదిరి.. నాగ చైతన్య 25వ సినిమా వెంకీ అట్లూరి డైరెక్షన్‌లో వస్తే.. ఆ తర్వాత ప్రాజెక్ట్ క్లాక్స్ దర్శకత్వంలో వచ్చే ఛాన్స్ ఉంది.
NC25 Movie, Naga Chaitanya, Venky Atluri






