ENGLISH | TELUGU  
Home  » Gossips

కార్తీ సెకండ్ తెలుగు మూవీకి ముహూర్తం ఫిక్స్.. డైరెక్టర్ ఎవరో తెలుసా?

on Feb 18, 2026

 

తెలుగు మార్కెట్ పై కన్నేసిన కోలీవుడ్ బ్రదర్స్
వెంకీ అట్లూరి దర్శకత్వంలో సూర్య మూవీ
అన్న బాటలోనే తమ్ముడు కార్తీ
ఆ కామెడీ డైరెక్టర్ తో కార్తీ మూవీ?

 

కోలీవుడ్ స్టార్ బ్రదర్స్ సూర్య(Suriya), కార్తీ(Karthi)లకు తెలుగునాట మంచి ఫాలోయింగ్ ఉంది. ఇప్పుడు ఈ బ్రదర్స్ తెలుగులో తమ మార్కెట్ ని మరింత పెంచుకునే పనిలో పడిపోయారు. 

 

సూర్య ప్రస్తుతం వెంకీ అట్లూరి దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణంలో తన 46వ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రానికి 'విశ్వనాథన్ అండ్ సన్స్' అనే టైటిల్ ప్రచారంలో ఉంది. (Suriya 46)

 

కార్తీ కూడా సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో ఒక సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది. 'మ్యాడ్', 'మ్యాడ్ స్క్వేర్' సినిమాలతో కామెడీ డైరెక్టర్ గా తనదైన ముద్రవేసిన కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుందని సమాచారం. 

 

నాగవంశీ నిర్మించనున్న ఈ చిత్రం తెలుగులోనే తెరకెక్కనుందట. మరో రెండు మూడు నెలల్లో పట్టాలెక్కే అవకాశముంది అంటున్నారు. కార్తీకి ఇది రెండో తెలుగు సినిమా. గతంలో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో నాగార్జునతో కలిసి 'ఊపిరి' అనే సినిమా చేశాడు. అది తెలుగు, తమిళ భాషల్లో ద్విభాషా చిత్రంగా రూపొందింది. 

 

కార్తీ కామెడీ టైమింగ్ బాగుంటుంది. కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో కార్తీ ఒక మంచి ఎంటర్టైనర్ చేస్తే ప్రేక్షకులు ఆదరిస్తారు అనడంలో డౌట్ లేదు.

 

హీరోయిన్ గా మీనాక్షి చౌదరి పేరు కూడా లాక్ చేశారని న్యూస్ వినిపిస్తోంది. సితార బ్యానర్ లో మీనాక్షి ఇప్పటికే 'గుంటూరు కారం', 'లక్కీ భాస్కర్', 'అనగనగా ఒక రాజు' వంటి సినిమాలు చేయడం విశేషం.

 

Also Read: తెలుగు సినిమాకు కొత్త తలనొప్పి.. చిన్న సినిమాలకే ఈ పరిస్థితి ఎందుకు?

 

 

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.