ENGLISH | TELUGU  
Home  » Gossips

సందీప్‌రెడ్డితో ముదిరిన వివాదం.. ‘స్పిరిట్‌’ నుంచి తప్ప్పుకున్న ప్రకాష్‌రాజ్!

on Feb 9, 2026


- మరోసారి వార్తల్లోకి వచ్చిన ‘స్పిరిట్‌’!

- ప్రకాష్ రాజ్, సందీప్ రెడ్డి మధ్య రేగిన వివాదం ఏంటి?

- ‘స్పిరిట్‌’ నుంచి ప్రకాష్ రాజ్ బయటికి రావడానికి అదే కారణమా?

- ప్రకాష్ రాజ్ విషయంలో ‘స్పిరిట్‌’ మేకర్స్ డెసిషన్ ఏంటి?

 

ఈమధ్యకాలంలో టాలీవుడ్‌లోని టాప్ హీరోల సినిమాలన్నీ పాన్ ఇండియా స్థాయిలోనే రూపొందుతున్న విషయం తెలిసిందే. అన్నింటి కంటే రెబల్‌స్టార్ ప్రభాస్ చేస్తున్న సినిమాల పైనే అందరి దష్టీ ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందులోనూ సందీప్‌రెడ్డి వంగా వంటి విలక్షణ దర్శకుడితో ప్రభాస్ చేస్తున్న సినిమా అంటే దానికి ఓ ప్రత్యేకత ఏర్పడుతుంది. సందీప్‌రెడ్డి అంతకుముందు చేసిన అర్జున్‌రెడ్డి, యానిమల్ సినిమాలే దానికి కారణం. ఆ సినిమాల్లో హీరో ఎంత ఫెరోషియస్‌గా కనిపిస్తాడో తెలిసిందే. ఇప్ప్పుడు ప్రభాస్, సందీప్ కాంబినేషన్‌లో రూపొందుతన్న ‘స్పిరిట్’ చిత్రం ఏ రేంజ్‌లో ఉండబోతోంది అనేది ఆసక్తికరంగా మారింది. 

 

ఈ సినిమాలో పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా ప్రభాస్‌ను ఒక డిఫరెంట్ లుక్‌తో, డిఫరెంట్ క్యారెక్టరైజేషన్‌లో చూపించబోతున్నాడు సందీప్. ఇక అతని సినిమాల్లో హీరో ఎలివేషన్స్ ఏ రేంజ్‌లో ఉంటాయో అందరికీ తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించి ఎలాంటి అప్‌డేట్ వచ్చినా అది క్షణాల్లో వైరల్ అయిపోతోంది. తాజాగా అలాంటి ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. సినిమాలో ఒక కీలక పాత్ర పోషిస్తున్న ప్రకాష్‌రాజ్ తప్ప్పుకున్నారనేది ఆ వార్త. 

 

తన గత చిత్రాలకు భిన్నంగా ఎంతో ఫాస్ట్‌గా ‘స్పిరిట్’ చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉన్నాడు సందీప్. అందులో భాగంగానే ప్రభాస్, ప్రకాష్‌రాజ్ మధ్య వచ్చే సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోందని ఆమధ్య న్యూస్ వచ్చింది. అయితే సడన్‌గా ప్రకాష్ రాజ్ సినిమా నుంచి తప్ప్పుకున్నారనే వార్త ఇప్ప్పుడు అందర్నీ షాక్‌కి గురి చేస్తోంది. అంత హైప్ ఉన్న భారీ సినిమా నుంచి ప్రధాన నటుడు తప్ప్పుకోవడం అనేది మామూలు విషయం కాదు. అయితే ఇందులో ఎంత నిజం ఉంది అనేది పక్కన పెట్టేస్తే.. ముందు ఆ వార్త రావడంతోనే షూటింగ్‌లో ఏం జరుగుతోంది అనే క్యూరియాసిటీ అందరిలోనూ పెరుగుతుంది. 

 

గతంలో రిలీజ్ అయిన ‘స్పిరిట్’ వాయిస్ టీజర్‌లో ఒక జైలు అధికారిగా ప్రకాష్‌రాజ్ నటిస్తున్నారనే విషయం అర్థమైంది. ప్రత్యేకంగా టీజర్‌లో వాయిస్ ఉంది అంటే సినిమాలో అతని క్యారెక్టర్ ఏ స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అంతటి ప్రాధాన్యం ఉన్న నటుడు సినిమా నుంచి తప్ప్పుకోవడం అనేది ఇప్ప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ సినిమా హీరోయిన్ విషయంలోనూ ఇదే జరిగిందని గతంలో వార్తలు వచ్చాయి.  మొదట అనుకున్న హీరోయిన్ దీపికా పదుకొనే. కొన్ని కారణాల వల్ల ఆమెను తప్పించి యానిమల్‌లో నటించిన దీప్తి తిమ్రిని తీసుకున్నారు. 

 

ఇక అసలు విషయానికి వస్తే.. ప్రకాష్‌రాజ్, సందీప్‌రెడ్డి మధ్య తలెత్తిన క్రియేటివ్ డిఫరెన్సెస్ కారణంగా ఆయన ఈ ప్రాజెక్ట్ నుంచి తప్ప్పుకున్నట్టు తెలుస్తోంది. ప్రకాష్‌రాజ్‌తో షూటింగ్ మొదలైన కొన్నిరోజులకే ఈ వార్త బయటికి రావడం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. సీన్స్‌ని సందీప్ తీస్తున్న విధానంతో ప్రకాష్‌రాజ్ ఏకీభవించకపోవడం వల్ల షూటింగ్‌కి ఇబ్బందులు ఎదురయ్యాయని తెలుస్తోంది. అందుకే ప్రకాష్ రాజ్ సినిమా నుంచి బయటికి వచ్చాడని వార్తలు వస్తున్నాయి. ప్రకాష్‌రాజ్ విషయంలో సందీప్ టెన్షన్ పడుతున్నాడని, నెక్స్‌ట్ ఏం చెయ్యాలన్నది ఇంకా డిసైడ్ అవ్వలేదని సమాచారం. 

 

ప్రకాష్‌రాజ్ స్థానంలో మరో నటుడ్ని తీసుకుంటారా లేక అతనితోనే కాంప్రమైజ్ అయి కంటిన్యూ అవుతారా అనే విషయం తెలియాల్సి ఉంది. సోషల్ మీడియలో చక్కర్లు కొడుతున్న ఈ వార్తపై ప్రకాష్‌రాజ్‌గానీ, చిత్ర యూనిట్‌గానీ స్పందించలేదు. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వస్తే తప్ప క్లారిటీ రాదు. ‘స్పిరిట్’ చిత్రాన్ని 2027 మార్చి 5న విడుదల చేస్తామని అఫీషియల్‌గా ఎనౌన్స్ చేశారు. దానికి తగ్గట్టుగానే షూటింగ్ కూడా చేస్తున్నారు సందీప్‌రెడ్డి. తాజాగా సోషల్ మీడియాలో ఈ సినిమాకి సంబంధించి జరుగుతున్న ప్రచారాలపై చిత్ర యూనిట్ ఎలా స్పందిస్తుందో, ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. 

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.