Home

»

Gossips

అల్లు అర్జున్, లోకేష్ కనగరాజ్ మూవీలో మరో స్టార్ హీరో.!

Aug 6, 2026 3:12PM

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్‌లో రాబోతున్న #AA23 సినిమా గురించి ఒక బిగ్ న్యూస్ సోషల్ మీడియాను ఊపేస్తోంది. ఈ భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌లో కీలక పాత్ర కోసం ఓ స్టార్ హీరో రంగంలోకి దిగుతున్నట్లు తెలుస్తోంది.

అల్లు అర్జున్, లోకేష్ కనగరాజ్ క్రేజీ కాంబో కావడంతో 'AA23'పై అనౌన్స్ మెంట్ తోనే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. తన గత చిత్రం 'కూలీ'తో అంచనాలను అందుకోలేకపోయిన లోకేష్.. ఈసారి ఇండియన్ బాక్సాఫీస్ ని షేక్ చేసి, తన పవరేంటో చూపించాలని టార్గెట్ గా పెట్టుకున్నారు. అందుకే 'AA23' విషయంలో ఎంతో కేర్ తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఈ భారీ ప్రాజెక్ట్‌లోకి ఒక ప్రముఖ బాలీవుడ్ హీరో ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు న్యూస్ వినిపిస్తోంది.

'AA23'లో కథకు కీలకమైన ఓ రోల్ కోసం బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ పేరును పరిశీలిస్తున్నారట. లోకేష్ కనగరాజ్ తన సినిమాల్లో ప్రతి పాత్రను ఎంత పవర్‌ఫుల్ గా డిజైన్ చేస్తారో తెలిసిందే. దీంతో ఇప్పుడు షాహిద్ కపూర్‌ పాత్ర ఎలా ఉండబోతోందనే ఆసక్తి నెలకొంది.

అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో 'రాకా' సినిమా చేస్తున్నారు. ఈ ఏడాది చివరి కల్లా ఆ మూవీ షూటింగ్ పూర్తి కానుంది. ఆ తర్వాత లోకేష్ ప్రాజెక్ట్ పట్టాలెక్కనుంది.

 

 

Allu Arjun, Lokesh Kanagaraj, AA23, Shahid Kapoor

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com