Home

»

Gossips

'లెనిన్' ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్.. రాయలసీమ గడ్డ మీద యంగ్ టైగర్ గర్జన!

Jun 10, 2026 4:22PM

అక్కినేని యువ హీరో అఖిల్ (Akhil Akkineni) నటిస్తున్న మోస్ట్ ఎవైటెడ్ మాస్ అండ్ ఎమోషనల్ లవ్ స్టోరీ 'లెనిన్' (Lenin) బాక్సాఫీస్ వద్ద సందడి చేయడానికి సిద్ధమవుతోంది. 'వినరో భాగ్యము విష్ణుకథ' సినిమాతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న మురళీ కిషోర్ అబ్బూరు ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాపై ఇండస్ట్రీలోనూ, ప్రేక్షకుల్లోనూ అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్, సాంగ్స్ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారి సినిమాపై పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేశాయి. ఈ క్రేజీ ప్రాజెక్ట్ జూన్ 26న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ స్పీడ్‌ను పెంచింది.

ఈ ప్రమోషన్లలో భాగంగా టాలీవుడ్ వర్గాల్లో ఒక సంచలన వార్త జోరుగా హల్‌చల్ చేస్తోంది. 'లెనిన్' ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను ఆధ్యాత్మిక క్షేత్రమైన తిరుపతిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించడానికి మేకర్స్ భారీ ప్లాన్ సిద్ధం చేస్తున్నారట. ఈ సినిమా కథాంశం రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో సాగనుండటం, ముఖ్యంగా హీరో అఖిల్, హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే చిత్తూరు యాసలో మాట్లాడనుండటంతో తిరుపతిలో ఈవెంట్ చేయడం ద్వారా లోకల్ ఆడియన్స్‌కు మరింత సులువుగా కనెక్ట్ అవ్వచ్చని చిత్ర బృందం భావిస్తోంది. అయితే ఈ ఈవెంట్‌కు గెస్ట్‌గా రాబోయే స్టార్ పేరు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

ఈ మెగా ఈవెంట్‌కు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) చీఫ్ గెస్ట్‌గా హాజరుకానున్నట్లు ఫిలిం నగర్ సర్కిల్స్‌లో గట్టిగా టాక్ వినిపిస్తోంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత సూర్యదేవర నాగవంశీతో ఎన్టీఆర్‌కు ఉన్న ప్రత్యేక అనుబంధం, అలాగే అఖిల్ అక్కినేని, ఎన్టీఆర్ మధ్య ఉన్న పర్సనల్ సాన్నిహిత్యం కారణంగా ఈ వేడుకకు రావడానికి తారక్ దాదాపు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఈ మాస్ ప్రమోషనల్ ప్లాన్ గనుక వర్కవుట్ అయి, జూన్ 26 రిలీజ్ కంటే ముందే యంగ్ టైగర్ తిరుపతి గడ్డపై అడుగుపెడితే అటు అక్కినేని అభిమానులు, ఇటు నందమూరి అభిమానుల ఉత్సాహానికి అవధులు ఉండవు. రాయలసీమ వేదికగా సాగబోయే ఈ అరుదైన మల్టీస్టార్ వేడుకకు సంబంధించి చిత్ర యూనిట్ నుంచి మరికొద్ది రోజుల్లోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

కాగా, గతంలో అఖిల్ అక్కినేని 'మిస్టర్ మజ్ను' మూవీ ఈవెంట్ కి కూడా ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్‌గా హాజరవ్వడం విశేషం.

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com